Kiara Advani in Ambani Event(Bollywood celebrity news): ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ ఈవెంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని సెలబ్రెటీలు, ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. అందులో భాగంగానే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ. సొగసైన ముత్యాలతో అలంకరించబడిన ప్రీ డ్రేప్ట్ పాస్టెల్ పింక్ చీర ధరించి ఆ చీర కట్టులో కియారా అందరి దృష్టిని ఆకర్షించింది.
అదిరిపోయే లుక్‌లో ఈవెంట్‌కి వచ్చిన వారందరి మతిపోగొట్టింది. దీంతో కుర్రకారు కాస్త ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ నటి కియారా మ్యాటర్‌కి వస్తే.. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. అంతేకాదు డాన్ 3లో రణవీర్‌సింగ్ సరసన సైతం ఈ భామ నటించనుంది. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసింది ఆ మూవీ యూనిట్.
Also Read: కాంట్రవర్సీపై హీరో కమల్‌హాసన్ క్లారిటీ
ఇక వీటితో పాటుగా బాలీవుడ్ హీరో కండలవీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2 మూవీలో కూడా ఈ భామ నటించనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ భామకి మాత్రం వరుస ఆఫర్లతో బిజీ బిజీ అవుతుందనే చెప్పాలి. ఇక 2020 నుండి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ గురించి పుకార్లు షికార్లు కొట్టడంతో, అద్వానీ ఈ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అందరికి షాక్ ఇచ్చి ఫిబ్రవరి 7 2023న వీరిద్దరు పెద్దల సమక్షంలో జైసల్మేర్, రాజస్థాన్ రాష్ట్రంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుని పుకార్లకు చెక్ పెట్టారు.