BigTV English

IND vs ZIM: రెండో టీ20లో భారత్ ఘన విజయం..

IND vs ZIM: రెండో టీ20లో భారత్ ఘన విజయం..

India vs Zimbabwe 2nd T20I 2024: జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. హరారె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 100 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(100 – 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ బాదాడు. రుతురాజ్ గైక్వాడ్ (77 – 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) అర్ధ శతకంతో మెరుపులు కురిపించాడు. దీంతో 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే చతికిలపడింది.


భారత బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే జింబాబ్వే ఆలౌటైంది. ఓపెనర్ మద్వీర(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (26- 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. జాంగ్వి(33), జోనాథన్ క్యాంప్ బెల్(10) పరుగులు చేశారు.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న..?


సికిందర్ రజా(4), ఇన్నోసెంట్ కైయా (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. క్లైవ్ మండాడే (0), డియోన్ మేయర్స్ (0) పరుగుల ఖాతా తెరవలేదు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముఖేష్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు.

అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. శుభ్ మన్ గిల్ (2)ని ముజరబాని పెవిలియన్ కు పంపాడు. తరువాత రుతురాజ్, అభిషేక్ శర్మ జోడీ మరో వికెట్ పడకుండా నిలకడగా కనిపించింది. తరువాత సెంచరీ హీరో అభిషేక్ శర్మ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో ఉన్న అతడు తరువాత గేర్లు మార్చి ఆడాడు. డియోన్ మేయర్స్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 4, 6, 4 తీశాడు. రజా వేసిన 13 ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ లు బాదేశాడు అభిషేక్.

Also Read: వింబుల్డన్‌ సెంటర్ కోర్టులో క్రికెట్ లెజెండ్‌కు అరుదైన గౌరవం..

మసకజ్జ వేసిన తరువాతి ఓవర్ లో అభిషేక్ హ్యాట్రిక్ సిక్స్ లు సాధించి తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ అందుకున్నాడు. కానీ, తరువాత బంతికే మేయర్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. 38 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న రుతురాజ్.. తరువాత దుకూడు పెంచాడు. చటార బౌలింగ్ లో వరుసగా 4, 6, 4, 4 పరుగులు రాబట్టాడు. చివరలో రింకు సింగ్ (48 – 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లు) తనదైన శైలిలో సిక్స్ లు తీశాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

Tags

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×