EPAPER

Hyundai Exter Knight Edition: హ్యుందాయ్ నుంచి కొత్త ఎడిషన్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

Hyundai Exter Knight Edition: హ్యుందాయ్ నుంచి కొత్త ఎడిషన్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

Hyundai Exter Knight Edition Teaser Released: హ్యుందాయ్ కార్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్ల తయారీ కంపెనీ కూడా వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తుంది. ఇక ఇప్పుడు మరొక కొత్త ఎడిషన్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. హ్యుందాయ్ ఇండియా ఎక్స్‌టర్ ఎస్‌యూవీలో స్పెషల్ నైట్ ఎడిషన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది‌. తాజాగా ఈ మోడల్ టీజర్‌ను రిలీజ్ చేసింది. హ్యుందాయ్ లైనప్‌లోని వెన్యూ మోడల్ మాత్రమే ఈ ప్రత్యేక డార్క్ ఎడిషన్‌ను కలిగి ఉంది. ఇక ఇప్పుడు ఎక్స్‌టర్ అదే డార్క్ ఎడిషన్‌తో రానుంది. ఈ కొత్త నైట్ ఎడిషన్ రూ.6.12 లక్షల ప్రారంభ ధర నుండి రూ.10.28 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వరకు నిర్ణయించబడింది.


రిలీజ్ అయిన టీజర్ ప్రకారం.. టీజర్‌లో ఈ మోడల్ వెనుక భాగంలో ఎక్స్‌టర్ బ్యాడ్జ్‌ను స్పష్టంగా చూడవచ్చు. ఈ Exter ప్రస్తుతం ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి స్టార్రి నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ, కాస్మిక్ బ్లూ ఆప్షన్లు. ఇక దీని ఇంటీరియర్ డార్క్ థీమ్‌తో చాలా అందంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది డాష్‌బోర్డ్ నుండి సీట్ల వరకు ప్రతిదీ కవర్ చేస్తుంది.

ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 8-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే చుట్టూ సౌండ్, వాయిస్-ఎనేబుల్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇది క్రూయిజ్ కంట్రోల్, బ్యాక్ సైడ్ AC వెంట్‌లు, నాలుగు స్పీకర్లు, USB ఛార్జర్, కీలెస్ ఎంట్రీ, IRVM మరిన్నింటిని కూడా కలిగి ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్, వెనుక పార్కింగ్ కెమెరా, సెన్సార్, TPMS, ABS, ESC, HAC, VSM వంటి ఇతర ఫీచర్లు ఉంటాయి.


Also Read: మహీంద్రా ఎక్స్యూవీ కారుపై రూ. 2 లక్షల భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే?

ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో జత చేయబడిన 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 113.8Nm గరిష్ట టార్క్, 82bhp గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. అలాగే ఇందులో బై ఫంక్షన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, స్కిడ్ ప్లేట్‌ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో హెచ్ ఆకారంలో ఉన్న డీఆర్ఎల్‌ల కారణంగా ఈ కొత్త ఎస్యూవీకి మంచి క్రేజీ లుక్ వస్తుంది. ఇవే కాకుండా ఈ నైట్ ఎడిషన్‌లో ఫిట్, ఫీల్, డ్యాష్ బోర్డ్ లే అవుట్ వంటి మరిన్ని ఫీచర్లను బాగా తీర్చిదిద్దారు. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేసే హచ్డీ ఇన్ఫోటైన్మెంట్ స్కీన్‌ను అమర్చారు.

Tags

Related News

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Today Gold Prices: పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Big Stories

×