Big Stories

Land Rover Defender Octa : ల్యాండ్ రోవర్ నుంచి పవర్ ఫుల్ ఎస్‌యూవీ.. జూలైలో లాంచ్!

Land Rover Defender Octa : ప్రజెంట్ జనరేషన్‌లో ప్రతి ఒక్కరు తమకంటూ సొంత కారు ఉండాలని భావిస్తున్నారు. అయితే చాలా మంది వారి హోదాకు తగ్గట్టుగా కార్లను కొంటున్నారు. అందుకోసం కోట్లు రూపాయలను కుమ్మరిస్తున్నారు. మార్కెట్‌లో ఏ కొత్త కారు వచ్చినా కచ్చితంగా వారి గ్యారేజీలో ఉండాలంటున్నారు. బడాబాబుల ఇళ్లలో పదుల సంఖ్యలో కార్లు ఉంటున్నాయి. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే ప్రముఖ ఆటో మొబైల్ ప్రీమియం లగ్జరీ కార్లను తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ పవర్ ఫుల్ ఎస్‌యూవీ డిఫెండర్ OCTAని గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ కారు ఫీచర్లు, ధర  తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ల్యాండ్ రోవర్ డిఫెండర్ OCTA జూలై 2024లో లాంచ్ కానుంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ అనేక గొప్ప SUVలను అందిస్తుంది. డిఫెండర్ OCTAని కంపెనీ త్వరలో పరిచయం చేయనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. దీనిలో దాని డిజైన్ స్పష్టంగా చూడవచ్చు.

- Advertisement -

Also Read : అల్ట్రావయోలెట్ మ్యాక్ 2 బుకింగ్స్ స్టార్ట్.. ఈ బైక్ రెండు ట్రక్కులను లాగగలదు!

అయితే ఇందులో మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 14వ హీటెడ్ మరియు కూల్డ్ ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్, ఆల్ వీల్ డ్రైవ్, ATPC, హిల్ లాంచ్ అసిస్ట్, EPAS, DSC, ETC, RSC ఉన్నాయి. హెచ్‌డిసి, మ్యాట్రిక్స్ ఎల్‌ఇడి లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 పార్కింగ్ కెమెరా, పివి ప్రో వంటి ఫీచర్లను కూడా అందించవచ్చు.

ఇంజన్ గురించి కంపెనీ ఇంకా పెద్దగా సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ SUV V8 ట్విన్ టర్బో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రావచ్చు. ఈ SUVలో 6D డైనమిక్స్‌తో కూడిన ఎయిర్ సస్పెన్షన్‌ను కూడా కంపెనీ అందించనుంది. దీని వల్ల ఏ రకమైన రోడ్డుపైన అయినా డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని కంపెనీ అధికారులు తెలిపింది.

Also Read : దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ OCTA కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో SUV సామర్థ్యాలను పరీక్షించింది. SUVలపై కంపెనీ దాదాపు 13960 పరీక్షలు చేసింది. ఇది జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, దుబాయ్, అమెరికా, UK వంటి దేశాలలో అనేక విధాలుగా పరీక్షించబడింది. ఆటోమేకర్ డిఫెండర్ ఆక్టా SUVని జూలై 3, 2024న విడుదల చేయనున్నట్లు ల్యాండ్ రోవర్ తెలియజేసింది. ఇది అత్యంత శక్తివంతమైన డిఫెండర్. JLR బ్యాడ్జ్‌తో వస్తున్న మొదటి SUV కూడా ఇదే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News