E-Paper
Advertisement

Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!
Advertisement

Moto Buds 2 Fusion: మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లను తీసుకొచ్చే మోటరోలా సంస్థ ఇప్పుడు మరో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో మన ముందుకు వస్తోంది. Moto Buds 2 Fusion పేరుతో రాబోతున్న ఈ ఇయర్‌బడ్స్ లాంచ్ డేట్, ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించేసింది. సెప్టెంబర్ 15న భారతదేశంలో విడుదల అవుతున్న ఈ ‌బడ్స్.. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉండబోతున్నాయి. చూడటానికి చాలా ట్రెండీగా, స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ గురించే ప్రస్తుతం టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

ఆకర్షణీయమైన డిజైన్:

Moto Buds 2 Fusion ఇయర్‌బడ్స్‌లో డిజైన్ పరంగా కంపెనీ చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా పాంటోన్ టాప్ షూ, పాంటోన్ లారెల్, పాంటోన్ సర్ఫ్ ది వెబ్ అనే 3 విభిన్నమైన, చూడటానికి చాలా అందంగా ఉండే కలర్ ఆప్షన్లలో ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. కేవలం లుక్స్ మాత్రమే కాకుండా రోజంతా చెవుల్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉండేలా వీటిని డిజైన్ చేశారు.

Advertisement

Also Read: వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ:

ఇక అసలైన మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 12.4ఎంఎం టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అందించారు. దీనికి తోడు మోటరోలా సొంత ఆడియో ట్యూనింగ్ కూడా ఉండటంతో పాటలు వింటున్నప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. ఇవే కాకుండా ఏకంగా 55 డెసిబెల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. అంటే బయట ఎంత శబ్దం ఉన్నా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్‌గా సాంగ్స్ వినొచ్చు. అలాగే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 13 గంటలు, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 53 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

ఆరు మైక్రోఫోన్లు:

Advertisement

ఈ Moto Buds 2 Fusionలో కాలింగ్ కోసం ఒక్కో దాంట్లో మూడేసి చొప్పున మొత్తం 6 మైక్రోఫోన్లు ఇచ్చారు. క్రిస్టల్‌టాక్ ఏఐ టెక్నాలజీ ఉండటం వల్ల మనం మాట్లాడేటప్పుడు అవతలి వారికి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వినిపించకుండా క్లియర్‌గా వాయిస్ వెళ్తుంది. బ్లూటూత్ వెర్షన్ 6.0 సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ లేదా లాప్‌టాప్‌కు ఇవి చాలా తొందరగా కనెక్ట్ అవుతాయి. ఆటోమేటిక్ స్విచింగ్ ఫీచర్ ద్వారా ఒకేసారి వేర్వేరు డివైజెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ఇందులో వేర్ డిటెక్షన్, టచ్ కంట్రోల్స్, స్పేషియల్ ఆడియో వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. ఇవి దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌తో వస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇవి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. Moto Buds 2 Fusion ధర వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే మరి.

Also Read: స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

Tags

Related News

50 గంటల బ్యాటరీ లైఫ్.. బోట్ ఎయిర్‌డోప్స్ 212 ఫీచర్లు అదుర్స్!

రూ.10,000 లోపే 5G ఫోన్? Lava Bold N4 Proపై భారీ అంచనాలు.. ఫీచర్లు ఇవే!

రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!

రూ.500 లోపే అదిరిపోయే సౌండ్‌బార్.. తక్కువ ధరలో సూపర్ మ్యూజిక్

వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

Big Stories

Advertisement
×