Big Stories

Electric Car : అరగంటలోనే ఫుల్ ఛార్జ్..ఒక్క ఛార్జ్ తో 570 కిలోమీటర్ల ప్రయాణం

Electric Car

- Advertisement -

BYD To Launch Seal EV Sedan : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా, బీవైడీ కంపెనీలు పరిచయం అక్కర్లేని పేర్లు. ఈ రెండు కంపెనీల మధ్య మార్కెట్‌లో పెద్ద పోటీ నడుస్తోంది. టెస్లా కంపెనీ భారత్‌లోకి రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో టెస్లా కార్లను తలదన్నే విధంగా బీవైడీ సంస్థ సరికొత్త మెడల్ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే సంస్థ నుంచి మార్చి 5న ‘సీల్ ఎలక్ట్రిక్ సుడాన్’ పేరిట ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొస్తుంది.

- Advertisement -

Read More : 7 Seater Car @ Rs 6 Lakhs: రూ. 6 లక్షలకే 7 సీటర్ కారు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్లు!

బీవైడీ కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు ‘అటో 3 SUV’, ‘e6 MPV’ అనే రెండు మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేది బీవైడీ నుంచి మూడో ఎలక్ట్రిక్ మోడల్ కారు. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు చూసేద్దాం.

సీల్ ఎలక్ట్రిక్ సుడాన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

  1. ఎలక్ట్రిక్ సుడాన్ బరువు 2,055 కిలోలు.

2. బ్యాటరీలో కంపెనీకి చెందిన బ్లేడ్ టెక్నాలజీని ఉంటుంది.

3. 150kW వరకు ఛార్జింగ్ స్పీడ్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

4. కారును 26 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు.

5. 11kW AC ఛార్జర్‌తో బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 8.6 గంటలు పడుతుంది.

6. కారు డ్యూయల్ మోటార్‌తో AWD వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రావచ్చు.

7. ఫుల్ ఛార్జింగ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

8. కారు 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంటుంది.

9. కారు దాదాపు రూ. 50లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో లభించనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News