BigTV English

Gold In india: 25 వేల టన్నులు.. మన ఆడోళ్లు దాచిన బంగారమంత కాదు పాకిస్తాన్ బతుకు..

Gold In india: 25 వేల టన్నులు.. మన ఆడోళ్లు దాచిన బంగారమంత కాదు పాకిస్తాన్ బతుకు..

Gold In india: మన ఇళ్లలోని బంగారం విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు. ప్రపంచం మొత్తం దగ్గరున్న బంగారంలో మనదగ్గరున్న శాతమెంతో తెలిస్తే షాకవుతారు. మనదసలు ఉట్టి ఇటుకల ఇల్లు కాదు.. బంగారు ఇల్లు. గోల్డెన్ హోం. అందుకు కారణమేంటి? ప్రపంచ ప్రైవేటు గోల్డ్ ప్రాపర్టీలో మనమెందుకంత ముందంజలో ఉన్నాం. ఆ డీటైల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.


భారత్ ఇంటింటి బంగారం

భారతదేశంలో ఇంటింటి బంగారం విలువ పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ కంటే ఆరు రెట్లు పెద్దది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల గృహ సంపదకన్నా కొన్ని వందలు వేల రెట్లు ఎక్కువ. దేవాలయాలతో సహా భారతీయ కుటుంబాల సమిష్టి సంపద విలువ 25 వేల టన్నులు. దీని విలువ మార్కెట్లో 2. 4 ట్రిలియన్లుగా అంచనా వేసింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఇది మన 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో 56 శాతంగా అంచనా.


2. 4 ట్రిలియన్లు- WGC

2025 ఫైనాన్షియల్ ఇయర్ కోసం ఐఎంఎఫ్ ఒక అంచనా వేసింది. దీని ప్రకారం పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ 411 బిలియన్ డాలర్ల విలువైంది. అయితే భారతదేశంలోని ప్రైవేటు బంగారు నిల్వల మొత్తం ఎంతని చూస్తే ఇది పాకిస్థాన్ జీడీపీ కంటే ఆరు రెట్లు అధికంగా కనిపిస్తోంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. 2. 4 ట్రిలియన్ డాలర్ల ఇటలీ, 2. 3 డాల్ల కెనడా జీడీకన్నా ఎక్కువే.

2026 నాటికి ఔన్సు ధర 3500 డా. కి పెరుగుదల

యూనియన్ బ్యాంక్ ఆఫ్‌ స్విట్జర్లాండ్ ప్రకారం.. 2020 నాటి కాలం నుంచి బంగారం ధరలు ఎక్కువయ్యాయి. ఇది భారతీయ గృహ సంపదను మరింత పెంచినట్టు తెలుస్తోంది. వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, రాజకీయ పరిణామాలు, ఇంకా ఎన్నో అనిశ్చితుల కారణంగా 2026 నాటికి బంగారం ధరలు ఔన్సుకు 3500 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది స్విస్ బ్యాంక్. 2026 ఆర్ధిక సంవత్సరానికిగానూ.. భారత్ లో బంగారం పరిమాణం విషయంలో డిమాండ్ తగ్గుతుందని.. యూబీఎస్ అంచనా వేసినప్పటికీ.. అధిక ధరలు నికర దిగుమతులను 55- 60 బిలియన్ డాలర్లకు చేర్చుతాయని తెలుస్తోంది. ఇది జీడీపీలో 1. 2 శాతంగా ఉండటం విశేషం.

ఇది గతం కంటే 15 శాతం ఎక్కువ

ప్రజెంట్ గోల్డ్ రేట్స్ రికార్డులు తిరగరాస్తున్నాయి. అయినా సరే ప్రస్తుతం బంగారం డిమాండ్ ఏమంత తగ్గలేదు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర డిమాండ్ 782 టన్నులు కాగా.. ఇది గతం కంటే 15 శాతం ఎక్కువ. ఆభరణాల డిమాండ్ అయితే కాస్త తగ్గిన మాట నిజం. బంగారు కడ్డీలు, నాణేలలో రిటైల్ ఇన్వెస్ట్ మెంట్ 25 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 2024 మధ్య కాలంలో కస్టమ్స్ సుంకం 15 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది.

2027 నాటికి ఈ డిమాండ్ 800 టన్నులకు డిమాండ్

2026 నాటికి హౌస్ హోల్డ్ డిమాండ్.. 725 టన్నులకు తగ్గుతుంది. 2027 నాటికి ఈ డిమాండ్ 800 టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తోంది యూబీఎస్. ఈ రికవరీ వెనక కేంద్ర వేతన పెరుగుదల ఉండొచ్చని అంటున్నారు. ఈ మొత్తం విలువ 55 బిలియన్ డాలర్లు. ఇది పొదుపును పెంచుతుంది. దీంతో ఇటు రియల్ ఎస్టేట్ అటు గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. అందుకే 2027 నాటికి బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని అంటోంది స్విస్ బ్యాంక్.

మనం తాకట్టు పెడుతోన్న బంగారం 2 శాతం మాత్రమే

భారత్ బంగారు నిల్వలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ఈ సంపద ద్వారా మనీ జనరేట్ చేసే యత్నాలు చాలా వరకూ తగ్గాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలో విస్తరించడానికి ప్రయత్నించినప్పటికీ.. గృహ బంగారంలో 2 శాతంకన్నా తక్కువ రుణాలకు పూచీకత్తుగా వాడుతున్నట్టు చెబుతోంది స్విస్ బ్యాంక్. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళ వంటి సంస్థలు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. అయితే బంగారు ఆభరణాల పై ఉన్న మోజు.. గోల్డ్ బాండ్స్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ని దెబ్బ తీసినట్టుగా చెబుతారు. అందుకు 2024లో సావరిన్ బాండ్స్ నిలిపివేతే అతి పెద్ద ఉదాహరణగా చెబుతోంది స్విస్ బ్యాంక్. బంగారం ధర ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో.. ఇది ప్రభుత్వానికి భారమయ్యే అవకాశముంది. అందుకే ఇలా చేసినట్టు చెబుతున్నారు నిపుణులు. బంగారం దిగుమతి భారం ఎక్కువగా ఉన్నప్పటికీ.. భారత్ కరెంటు ఖాతా లోటు నిర్వహించదగిన స్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రపంచ ప్రైవేటు బంగారు నిల్వలో 14 శాతం భారత్ లో

ప్రపంచంలోని ప్రైవేటు బంగారు నిల్వలో 14 శాతం భారత్ లోనే ఉంది. ఇది అతి పెద్ద ప్రైవేట్ గోల్డ్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. స్విస్ బ్యాంక్ చెప్పినట్టు బంగారంతో భారతీయ కుటుంబాలకు అతి పెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత బంగారముంటే అంత గొప్ప. సరిగ్గా అదే సమయంలో వారినీ అలవాటు సంపన్నులుగా మార్చుతోంది. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానమని.. బంగారు నిల్వలు ఎంతగా ఉంటే తమ చెంత అంతటి లక్ష్మీకటాక్షం ఉన్నట్టు భావిస్తారు కాబట్టి.. భారతీయ కుటుంబాలకూ బంగారానికీ ఒక విడదీయరాని అనుబంధంగా మారింది పరిస్థితి.

భారత్‌లో బంగారం అదో ఎమోషన్

మన ప్రాంతంలో నీ ఇల్లు బంగారం కాను.. అంటారు. కారణం.. ఇక్కడ బంగారమంటే అదో ఎమోషన్. ప్రతిదానికీ బంగారం లాంటి మనిషి, బంగారు కొండ.. ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో.. ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండటంతో.. ఇక్కడ గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క.

బంగారు నిల్వ చేయడం భారత్ సంప్రదాయం

గోల్డ్ ఇన్వెస్ట్ మెంటే కాదు- సెంటిమెంటు కూడా..భారతదేశానికి బంగారానికి ఉన్న అనుబంధం.. మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ స్వర్ణంగా పిలిచే బంగారం నిల్వ చేయడం ఒక సంప్రదాయం. మరీ ముఖ్యంగా ఆడపిల్లలను బంగారు ఆభరణాలతో ముంచెత్తాలని అనుకుంటారు. అంతే కాదు ఎవరికి ఎంత బంగారముంటే వారికి అంతటి సామాజిక గౌరవం విలువ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలపుడు ఇక్కడి మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా తమ హోదాను ప్రదర్శిస్తుంటారు.

బంగారం ఒక శుభప్రదంగా భావన

మరీ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో బంగారం ఒక శుభ ప్రదమైన భావన. ఇక్కడ ఏదైనా సరే బంగారంతో ఉంటే దాన్నొక దైవంగా భావిస్తుంటారు. ఆ మాటకొస్తే మన ఇళ్లు వాకిళ్లూ ఇంకా దేవాలయాలు ఇలా అన్నింటా బంగారం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది.

బంగారు వాకిలి, బంగారు కిరీటాలు, గోపురాలు, రథాలు..

బంగారు వాకిలి అంటూ మన ఆలయ వ్యవస్థలో బంగారం అతి పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక బంగారు కిరీటాలు, గోపురాలు, రథాలు అంటూ బంగారం వాడకం విలువ అధికంగా కనిపిస్తుంది. అంటే ఆయా దేవీ దేవతలు సైతం.. ఎంత ప్రముఖమైన వారో తెలియ చేసేది ఈ బంగారమే. ఆ మాటకొస్తే గోల్డెన్ టెంపుల్ కల్చర్ భారత ఆధ్యాత్మిక విభాగంలో ఒక భాగం.

బంగారం కలిగి ఉండటం స్థిరత్వానికి సూచిక

బంగారం కలిగి ఉండటం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక స్థిరత్వానికి సూచిక. ఏదైనా ఆపద వస్తే బంగారు నిల్వలు తమను ఆర్ధికంగా ఆదుకుంటాయని నమ్ముతుంటారు భారతీయులు. అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి వారి జీవితాల్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వసిస్తారు.

గోల్డ్ నాట్ ఓన్లీ మెటల్- ఇట్సే మెంటల్ స్టేటస్ ఆల్సో

బంగారం కేవలం మెటల్ మాత్రమే కాదు ఒక మెంటల్ స్టేటస్ కూడా. కారణం బంగారం ఎంత ఎక్కువ ఉంటే.. అంత భరోసా. ఈ భరోసాను తమ జీవితంలో తప్పక ఉండాలని భావిస్తారు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా బంగారం కొనడం జీవితంలో ఒక భాగం చేసుకుంటారు. గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్స్ తెలివైన పెట్టుబడిగా భావస్తుంటారు. బంగారం ద్రోవ్యోల్బణానికి వ్యతిరేకంగా పని చేస్తుందని నమ్ముతారు. అంతే కాదు ఆర్ధికమైన అండదండలను ఇస్తుందని భావిస్తారు.

టాప్ 20 గోల్డెన్ కంట్రీస్ లో భారత్ 9వ స్థానం

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు వినియోగదారులలో ఒకటి. టాప్ 20 గోల్డెన్ కంట్రీస్ లో మన దేశం 9వ స్థానంలో ఉంటుంది. కానీ మన దగ్గర బంగారానికి ఉన్న విలువ దాన్ని ఆభరణాల ద్వారా ధరించే మోజు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ కేవలం మహిళలే కాదు పురుషులు సైతం గోల్డ్ మేన్స్ గా చెలామణీ అవుతుంటారు.

తొలుత బంగారమే డబ్బుగా ఉండేది

ఇల్లూ- వాకిలి- స్థలం- పొలం- ఎలాగో బంగారం సైతం అలాంటి ఆస్తిగా పరిగణించే దేశం కేవలం భారత్ మాత్రమే. అంతగా ఇక్కడ బంగారం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఆ మాటకొస్తే తొలుత బంగారమే డబ్బుగా ఉండేది. ఆ బంగారం ఒక చోట పెట్టి ఆ చీటీని బట్టీ తమ దగ్గర అంత బంగారం ఉందని చూపించుకునే వారు. ఆ తర్వాతి రోజుల్లో అదే కరెన్సీగా మారిందని అంటారు.

దేశ కరెన్సీ నిల్వలను ప్రభావితం చేసే బంగారం

ఒక దేశ కరెన్సీ నిల్వలను ప్రభావితం చేసేదే బంగారం. సాధారణంగా ఒక దేశంలో ఎంత బంగారం ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ కూడా అంతేగా పెరుగుతుంది. ఒక వేళ బంగారు నిల్వలు తగ్గితే కరెన్సీ విలువ కూడా తగ్గే ఛాన్సుంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. కాబట్టి డాలర్ తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ తగ్గితే ఆ దేశంలో బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఒక దేశం ఎంతటి బంగారం విలువలు కలిగి ఉంటుందో ఆ దేశం అంత సురక్షితంగా భావిస్తారు. దీని వల్ల ఆ దేశంతో వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ఇతర దేశాలు ముందుకు వస్తాయి.

కరెన్సీ విలువ ఎంత తగ్గితే- ఆ దేశ బంగారు ధరలు అంత పెరుగుదల

ఇక భారత్ విషయానికి వస్తే.. బంగారాన్ని కేవలం ఆర్ధిక స్థిరత్వం కోసం కాకుండా.. ఒక సెంటుమెంటుగా భావించడం వల్ల అది ఇటు అందానికి అందం- ఆర్ధిక పటుత్వానికి పటుత్వంగా నిలుస్తుండటం గమనార్హం.

 

Related News

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Big Stories

×