Hindu Durga Temple: బంగ్లాదేశ్‌లో ఇంకా హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాల్ని అక్కడి అల్లరి మూకలు వదిలి పెట్టడం లేదు. డాకాలోని కిల్కెట్ ప్రాంతంలో దుర్గామాత ఆలయాన్ని కూల్చి వేశారు యూనెస్ ప్రభుత్వం. అయితే ఒక ఫ్లై ఓవర్ పక్కనే నిర్మించబడినటువంటి దూర్గమాత ఆలయాన్ని ఆక్రమణగా ఒక రకంగా కబ్జాగా భావించి అక్కడి ప్రభుత్వాలు పోలీసులని బుల్‌డోజర్‌లను పెట్టి దుర్గామాత ఆలయాన్ని పూర్తిగా కూల్చివేశారు.
భూమి ఆక్రమణ పేరుతో ఈ దౌర్జన్యం చేసినట్టుగా యూనెస్ సర్కార్ పైన అక్కడ హిందువులు అభివర్ణిస్తూ ఉన్నారు. ఎటువంటి ముందస్తూ నోటిసులు ఇవ్వకుండానే ఈ విగ్రహాన్ని కూల్చివేశారు. విగ్రహంతో సహా ఆలయం పూర్తిగా కూడా ధ్వంసం అయ్యింది. ఈ ఘటనతో యూనెస్ ప్రభుత్వం పైన హిందువులు మండిపడుతున్నారు. అక్కడికి వచ్చిన మహిళలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దుర్గమాత ఆలయం ఎప్పుడో నిర్మించబడింది. అక్కడ రోజూ పూజలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కబ్జా చేసి నిర్మించారని, ఇదంతా ఆక్రమం అని యూనెస్ ప్రభుత్వం విగ్రహాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేశారు. వరుస క్రమంలో ఇప్పటికి సుమారుగా 2025లో నాలుగు ఆలయాలు ధ్వంసం అయ్యాయి. అలాగే 2024లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆలయాలు ధ్వంసం అయ్యాయి.
అంతేకాకుండా 2024లో కూడా ఈ రకంగానే దాడులు జరిగాయి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్కడి కొందరు అల్లరి మూకలు ప్రయత్నాలు చేసి మతాల కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రిజర్వేషన్ల కోసం దాడులు జరిగాయి, ఆలయాల ధ్వంసం చేశారు. అలాగే హిందువులంతా మైనార్టీలుగా ఉంటారు. అక్కడ హిందువులకు సంబంధించిన ఇళ్లపైన, ఆలయాలపైన, స్థావరాలపైన పెద్దఎత్తున దాడులు జరిగాయి.
Also Read: చపాతీలు దూదిలా మెత్తగా, రుచిగా రావాలంటే.. వీటిని వేయాల్సిందే..
బంగ్లాదేశ్‌లో హిందువుల లక్ష్మితో దాడుల జరుగుతున్నాయని, సనాతన ధర్మానికి ఎదురవుతున్న ముప్పును తిప్పిరొట్టడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాగా, హిందువులు తదితర మైనారిటీ వర్గాలపై, వారి ప్రార్థన స్థలాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్‌లోని31 సామాజిక, సాంస్కృతిక సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి.