BigTV English

Indian IT Companies Rank: అంతర్జాతీయంగా దూసుకుపోతున్న భారత ఐటీ కంపెనీలు.. టాప్ 10లో నాలుగు మనవే!

Indian IT Companies Rank: అంతర్జాతీయంగా దూసుకుపోతున్న భారత ఐటీ కంపెనీలు.. టాప్ 10లో నాలుగు మనవే!

Indian IT Companies Lead Global Rankings | భారతదేశం ఐటీ రంగంలో తన బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అంతర్జాతీయ ఐటీ సేవల విభాగంలో అత్యంత విలువైన 25 బ్రాండ్ల జాబితాలో భారత ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో, టెక్‌ మహీంద్రాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాను ప్రముఖ బ్రాండ్‌ విలువల సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది.


అంతర్జాతీయ ఐటీ బ్రాండ్లలో దూసుకుపోతున్న భారత్‌
ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సేవల కంపెనీల బ్రాండ్లలో అమెరికా 40% వాటాతో అగ్రస్థానంలో ఉంది.
భారతదేశం 36% వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
భారతీయ ఐటీ కంపెనీల బ్రాండ్ల విలువ మొత్తం 14% పెరగడం గమనార్హం.
2025లో మరింత విస్తరణ కోసం భారత కంపెనీలు సన్నద్ధమవుతున్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించడం, నియామకాల్లో దృష్టి పెట్టడం, కొత్త టెక్నాలజీలను స్వీకరించడం వంటి అంశాలు భారత కంపెనీల అభివృద్ధికి దోహదమవుతున్నాయి.

టాప్ టెన్ లో ప్రధాన ర్యాంకింగ్స్‌

1. యాక్సెంచర్‌ (అమెరికన్ కంపెనీ – అగ్రస్థానం). వరుసగా ఏడో సారి ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండు గానే నిలిచింది. బ్రాండు విలువ 2% పెరిగి 41.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.


2. టీసీఎస్‌ (భారత కంపెనీ రెండో స్థానం) టీసీఎస్‌ బ్రాండు విలువ 21.3 బిలియన్‌ డాలర్లు. ఈ కంపెనీ నాలుగో సారి ఈ స్థానంలో నిలిచింది. తొలిసారిగా 20 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించింది.

3. ఇన్ఫోసిస్‌ (మూడో స్థానం). ఇన్ఫోసిస్‌ బ్రాండు విలువ 16.3 బిలియన్‌ డాలర్లు. బ్రాండు విలువ 15% పెరగడం గమనార్హం. గత ఐదేళ్లలో అత్యధిక వార్షిక వృద్ధి రేటు (18.2%) నమోదు చేసింది.

4. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండు – 8వ స్థానం). బ్రాండు విలువ 8.9 బిలియన్‌ డాలర్లు. హెచ్‌సీఎల్ 17% వృద్ధి సాధించింది. కృత్రిమ మేధ (ఏఐ), పెద్ద ఒప్పందాలు దక్కించుకోవడం వంటి అంశాల్లో సంస్థ దూసుకుపోతోంది.

ఈ జాబితాలో చోటు సంపాదించిన ఇతర భారతీయ కంపెనీలు:

విప్రో (9వ స్థానం, బ్రాండు విలువ – 6.09 బిలియర్ డాలర్ల )
టెక్‌ మహీంద్రా
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
హెగ్జావేర్‌ టెక్నాలజీస్‌
హెగ్జావేర్‌ టెక్నాలజీస్‌ (ఈ జాబితాలో తొలిసారి ప్రవేశించింది.)

Also Read:  టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి

భవిష్యత్తులో భారత కంపెనీలకు మరిన్ని అవకాశాలు
బ్రాండ్‌ ఫైనాన్స్‌ విశ్లేషణ ప్రకారం.. అమెరికా ఐటీ సేవల మార్కెట్ పుంజుకుంటున్నందున, భారత కంపెనీలకు గిరాకీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2025 నాటికి భారత్‌ ఐటీ సేవల రంగంలో మరింత దూసుకుపోతుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ జాబితాలో భారత కంపెనీల వృద్ధి, బ్రాండు విలువలో పెరుగుదల కారణంగా భారతీయ ఐటీ రంగం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా భారతదేశం టాప్ ఐటీ బ్రాండ్లలో తన ప్రాధాన్యతను మరింతగా చాటుకోనుంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×