Home Remedies: బలహీనమైన రోగనిరోధక శక్తి తో పాటు, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు సమస్య వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు హోం రెమెడీస్ వాడటవ మంచిది. హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొన్ని సార్లు హోం రెమెడీస్ వాడటం వల్ల తక్షణ ఉఫశమనం లభిస్తుంది. బలుబు, దగ్గుతో ఇబ్బంది పడినప్పుడు పసుపు, తులసి, గోరువెచ్చని నీరు సమస్యను తగ్గిస్తాయి. మరి వీటితో హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.పసుపు పాలు:
ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు కలపండి.
రుచి కోసం పాలతో తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు.
నిద్రపోయే ముందు పసుపు పాలను కలిపి వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ హోం రెమెడీస్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండా బ్లాక్ అయిన ముక్కును క్లియర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
2.గోరువెచ్చని నీటితో పుక్కిలించండి:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి.
ఈ ద్రావణంతో రోజుకు 2-3 సార్లు పుక్కిలించండి.
ఉప్పు ద్రావణం గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. అంతే కాకుండా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
3. బాసిల్, బ్లాక్ పెప్పర్ టీ:
ఒక కప్పు నీటిలో 8-10 తులసి ఆకులు, 4-5 నల్ల మిరియాలు వేయండి.
దీనిని 5-7 నిమిషాలు మరిగించండి.
వడగట్టి అందులో తేనె కలుపుకుని వేడి వేడిగా తాగాలి.
ఈ టీ గొంతుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది మరియు బ్లాక్ చేయబడిన ముక్కును క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
4. అల్లం, తేనె:
కాల్చిన అల్లం, తేనె జలుబు దగ్గలకు సహజ నివారణగా పనిచేస్తాయి. ఇది మీ జలుబు, దగ్గును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
అల్లం , తేనె రెండూ ఆయుర్వేదంలో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి.
అల్లంలో జింజెరాల్ , షోగోల్ అనే మూలకాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి.
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అల్లం, తేనె మిశ్రమం:
ఇది శ్లేష్మాన్ని వదులుతుంది . గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది గొంతు వాపును తగ్గిస్తుంది.
తేనె సహజమైన దగ్గు సిరప్‌లా పనిచేస్తుంది. దగ్గును ఆపడానికి సహాయపడుతుంది.
Also Read: అలోవెరాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు రాలనే రాలదు
అల్లం, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి ?
అల్లం కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తర్వాత లేత గోధుమరంగు వచ్చేవరకు, తక్కువ మంట మీద బాగా వేయించాలి.
వేయించిన అల్లం చల్లారనివ్వాలి.
దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి చిన్న గిన్నెలో పెట్టుకోవాలి.
ఇప్పుడు దానికి స్వచ్ఛమైన తేనె వేసి బాగా కలపాలి.
అల్లంను తక్కువ మంటపై కాల్చడం వల్ల దాని సహజ నూనెలను సక్రియం చేస్తుంది. ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో తయారుచేసిన మిశ్రమాన్ని 1 టీస్పూన్ తీసుకోండి.
ముఖ్యంగా దగ్గు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు దీనిని 2-3 సార్లు ఒక రోజులో తీసుకోవచ్చు.