E-Paper
Advertisement

Entrepreneur On Indians: ఐఫోన్ కొంటారు గానీ.. పనికొచ్చే యాప్స్ కొనరు, ఇండియన్స్ ఆలోచనే అలాంటిదట!

Entrepreneur On Indians: ఐఫోన్ కొంటారు గానీ.. పనికొచ్చే యాప్స్ కొనరు, ఇండియన్స్ ఆలోచనే అలాంటిదట!
Advertisement

Indians Mentality: భారతీయుల మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. పనికి రాని వాటి కోసం వేలకు వేలు ఈజీగా ఖర్చు చేసే జనాలు, పని కొచ్చే పనులకు వంద రూపాయులు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. తాజాగా ఇదే విషయాన్ని ఆసక్తికరంగా చెప్పారు బెంగళూరుకు చెందిన  పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్. ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగపడే వస్తువుల కంటే, ఎక్కువ అందంగా కనిపించే వాటికే ప్రాధాన్య ఇస్తారని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన లింక్డ్ ఇన్ లో పోస్టు పెట్టారు.

అగర్వాల్ ఏం చెప్పారంటే?

ఇండియన్స్ ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటున్నారు అగర్వాల్. ఐఫోన్ కోసం రూ.1.2 లక్షలు ఖర్చు చేసేందుకు వెనుకాడని జనాలు.. అవసరమైన, పనికి వచ్చే యాప్‌ కు రూ. 99 చెల్లించేందుకు ఇష్టపడరని చెప్పారు. ఆ యాప్ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందోనని వెతుక్కుంటూ వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకుంటారని వివరించారు. యుటిలిటీ కంటే పైమెరుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ప్రజలు ఇతరులు చూడగలిగే వాటిపై విపరీతంగా ఖర్చు చేస్తారని, నిజంగా అవసరమైన వాటికి పైసా ఖర్చు చేయాలన్నా ఆలోచిస్తారని చెప్పారు. “రాయల్ ఎన్‌ ఫీల్డ్‌  షో రూమ్ లో రూ.3 లక్షలు పెట్టి బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి.. స్పాటిఫై ప్రీమియం కోసం నెలకు రూ. 500 చెల్లించడానికి ఇష్టపడడు” అని చెప్పుకొచ్చారు. వస్తువు ఏదైనా కానివ్వండి, తమ దగ్గర ఉందని ఎలివేట్ చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారని వివరించారు.

ప్రతి అంశానికి సోషల్ స్టేటస్ తో లింక్

Advertisement

భాతీయులు కొనుగోలు చేయబోయే ఉత్పత్తులను లెక్కలోకి తీసుకోరని, సోషల్ స్టేటస్ కోసం వాటిని కొనుగోలు చేస్తారని చెప్పుకొచ్చారు. కనిపించే వాటికే ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ, ఎక్కువ ఉపయోగించే వాటికి డబ్బులు చెల్లించకుండా ఎలా ఉండాలా అనే ఆలోచనలోనే ఎక్కువ మంది గమనిస్తారని చెప్పుకొచ్చారు.  అందుకే, స్టార్‌ బక్స్ ఎదురుగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయని, మెడిటేషన్ యాన్స్ వినియోగం 1 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. సాంప్రదాయ బద్దంగా జరగాల్సిన వివాహ వేడుకలను.. చాలా మంది తమ హోదాను చూపించుకునే కృతకంగా మార్చేశారని వివరించారు.

Read Also: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

డిస్కౌంట్ల కోసం ఎదురుచూపులు

Advertisement

అదే సమయంలో ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ రావాలనే ఆలోచన జనాల్లో పెరిగిందని అగర్వాల్ వివరించారు. కానీ, వారికి తెలియని విషయం ఏంటంటే.. ఆఫర్ లో వస్తువు తక్కువ ధరకు లభిస్తుందంటే, దానిలో ఏదో ఒక సమస్య ఉందని గుర్తుంచుకోవాలంటున్నారు. అందుకే, నాణ్యమైన వస్తువుల మీద డిస్కౌంట్లు గురించి ఆలోచించకూడదన్నారు. ఒకవేళ డిస్కౌంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ప్రొడక్ట్ లో లోపం ఉండటం ఖాయమన్నారు. ఇప్పటికైనా భారతీయులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు అగర్వాల్.

Read Also: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×