Indian e-commerce growth: ఈ-రిటైల్ రంగంలో భారత్ జోరు వేగంగా కొనసాగుతోంది. 2030 నాటికి ఈ రంగం మూడు రెట్లు పెరిగి 170 నుంచి 190 బిలియన్ (రూ. 1,62,64,72,81,37,000) డాలర్లకు చేరుకుంటుందని ఓ నివేదిక తెలిపింది. Bain & Company, Flipkart సంయుక్తంగా రూపొందించిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించాయి. దీనికి గల ప్రధాన కారణాలలో కొత్త కొనుగోలుదారుల పెరుగుదల, కొత్త వ్యాపార మోడళ్ల ఆవిష్కరణ, డిజిటల్ కొనుగోలు అలవాట్లు పెరగడమేనని తెలిపాయి.
రెండో అతిపెద్ద మార్కెట్
ప్రస్తుతం భారతదేశం 270 మిలియన్లకు పైగా ఆన్లైన్ కొనుగోలుదారులతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఈ-రిటైల్ మార్కెట్‌గా నిలిచింది. 2024లో ఈ రంగం 10–12% వృద్ధిని సాధించినప్పటికీ, గతంలో నమోదైన 20% పైగా వృద్ధిరేటుతో పోలిస్తే కొంత మందగమనాన్ని చూసింది. ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ఖర్చుపై ప్రభావం వంటి అంశాలు కూడా ఇందుకు కారణమని నివేదిక వెల్లడిస్తోంది.
2030 నాటికి
ఇదే సమయంలో భారతదేశం 2030 నాటికి $3,500–$4,000 GDP గడిస్తుందని అంచనా. ఆ క్రమంలో ఈ-కామర్స్ మార్కెట్ 18% పైగా వృద్ధిరేటుతో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వాణిజ్య రంగంలో డిజిటల్ మార్పులతో పాటు వినియోగదారుల్లో మార్పులు ఈ విప్లవాత్మక పెరుగుదలకు దోహదపడతాయని నివేదిక సూచిస్తోంది.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్..
ప్రధాన రంగాలు
ఈ-కామర్స్ రంగంలో ముఖ్యంగా గ్రాసరీ, లైఫ్స్టైల్, జనరల్ మెర్చండైజ్ విభాగాల వినియోగం పెరుగుతుందని నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ విభాగాలు మొత్తం వృద్ధిలో 70% వాటా కలిగి ఉండనున్నాయి. ఇవి ప్రస్తుతం ఉన్న స్థాయితో పోల్చితే 2–4 రెట్లు పెరుగుతాయని అంచనా.
క్విక్ కామర్స్ (Q-Commerce) దూసుకెళ్తోంది
కొత్తగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ (Quick Commerce) విభాగం కూడా భారీగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది మొత్తం ఈ-రిటైల్ GMVలో 10%, ఇక ఈ-గ్రాసరీ GMVలో 70–75% వాటా కలిగి ఉంది. 2030 నాటికి ఇది ప్రతి సంవత్సరం 40% పైగా వృద్ధిరేటును నమోదు చేయనున్నట్లు నివేదిక చెబుతోంది.
ఖర్చులను తగ్గించడంతో పాటు
క్విక్ కామర్స్ వ్యాపార మోడల్ వ్యయాలను తగ్గించడానికి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంతో పాటు, పెద్ద ఆర్డర్ విలువల ద్వారా లాభదాయకత సాధిస్తోంది. ప్రస్తుతానికి ఇది ప్రాథమికంగా గ్రాసరీ సెక్టార్‌లో గట్టిగా నిలదొక్కుకుంది. కానీ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, అపెరెల్ వంటి కొత్త విభాగాల్లోకి విస్తరించే అవకాశముంది.
ఈ-కామర్స్ అభివృద్ధికి కేంద్ర బిందువులు
2020 నుంచి భారతదేశపు చిన్న పట్టణాల్లో ఈ-కామర్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్తగా ఆన్లైన్ షాపింగ్ చేయడం ప్రారంభించిన వినియోగదారుల్లో 60% మంది టైర్-III, చిన్న పట్టణాల నుంచే వచ్చారు. అంతేకాకుండా, మొత్తం ఆన్లైన్ ఆర్డర్లలో 45% వాటా కూడా ఇక్కడి నుంచే వస్తోంది.