BigTV English

Chiranjeevi Remuneration : కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్… చిరు రూట్ మార్చేశాడా..?

Chiranjeevi Remuneration : కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్… చిరు రూట్ మార్చేశాడా..?

Chiranjeevi Remuneration : హీరోలు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. మొన్నా ఆ మధ్య… పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అలాగే.. ఇప్పుడు అట్లీ మూవీకి 175 కోట్ల వరకు వసూల్ చేస్తున్నాడు అనే టాక్ వచ్చేసింది. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఇప్పుడు టైర్ 1 హీరోలు అందరూ దాదాపు ఇలాంటి నెంబర్సే మెయింటైన్ చేస్తున్నారు.


అయితే సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్లు మాత్రం… అంతటి పారితోషికాలు తీసుకోవడం లేదు. అయితే… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి… అదే రూట్‌లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే.. చిరంజీవి ఇప్పుడు రాబోయే అనిల్ రావిపూడి మూవీకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ చూస్తే అలాగే అనిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో పాటు ఇప్పుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది రోజు ఈ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన కాల్సీట్స్ అన్నీ ఇచ్చేశాడు. బ్రేక్ ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది.


చిరు రెమ్యునరేషన్…

అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి రికార్డు స్థాయిలో తీసుకుంటున్నాడట. ఈ సినిమాకు దాదాపు 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది చిరంజీవి కెరీర్‌లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. విశ్వంభర మూవీకి చిరంజీవి దాదాపు 60 కోట్ల వరకు ఛార్జ్ చేశారట. ఇప్పుడు ఈ మూవీకి 15 కోట్ల వరకు పెంచి… 75 కోట్లు తీసుకుంటున్నాడట.

నిజానికి చిరంజీవి రెమ్యునరేషన్ ఇంతలా తీసుకోడు. ఆయన నిర్మాతల కోసం ఆలోచిస్తాడు అని ఇప్పటికే ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు. కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా డిజాస్టర్ అయినా… నిర్మాతలు లాస్ అయినా.. చిరంజీవి తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో కొంత వరకు నిర్మాతలకు రిటర్న్  ఇచ్చేవాడు.

గతంలో చిరంజీవి రెమ్యునరేషన్… 

విశ్వంభర మూవీకి చిరు దాదాపు 60 కోట్లు తీసుకున్నట్టు టాక్. అలాగే భోళా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ సినిమాలకు దాదాపుగా  50 కోట్ల వరకు తీసుకున్నాడట. అలాగే ఆచార్య మూవీకి 45 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడట. అయితే… ఆ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో దాదాపు 50 శాతం వరకు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడని సమచారం. గతంలో శంకర్ దాదా జిందాబాద్ మూవీకి కూడా ప్లాప్ అయింది. అప్పుడు కూడా చిరంజీవి 15 కోట్ల వరకు తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి కొంత తిరిగి ఇచ్చాడనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×