Big Stories

Infosys Infosys Q4 Results: అంచనాలకు మించి రాణించిన ఇన్ఫోసిస్.. క్యూ4లో రూ.7,969 కోట్ల లాభం!

Infosys Q4 Results: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే.. 30% అధిక లాభాలను సాధించింది. గతంలో ఏకీకృత ఆదాయం రూ.37,923 కోట్లు ఉండగా.. 1.3% పెరిగి రూ.37,441 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్‌ రూ.26,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

- Advertisement -

2022-203 లాభం రూ.24,095 కోట్లు కాగా ఈ సారి 8.9% పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం రూ.1,46,767 కోట్ల నుంచి 4.7% పెరిగి రూ.1,53,670 కోట్లకు చేరింది. నిర్వహణ మార్జిన్‌ 20.7 శాతంగా ఉంది. 2023-24లో పెద్ద కాంట్రాక్టుల మొత్తం విలువ 17.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇందులో 52% నికరంగా కొత్త కాంట్రాక్టులేనని కంపెనీ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్‌ 20.1 శాతంగా ఉంది.

- Advertisement -

Also Read: Elon Musk: మోదీతో ఎలాన్ మస్క్ భేటి.. భారత్‌లో 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..!

23 ఏళ్లలో తొలిసారి ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరికి కంపెనీలో 3,17,240 మంది పనిచేయగా.. 2022-23 సంవత్సరాంతంలో 3,43,234 మంది  పనిచేశారు. అయితే ఈసారి 7.5 % ఉద్యోగులు తగ్గారు. ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఉద్యోగుల సంఖ్య తగ్గడం గత 23 ఏళ్లలో ఇదే తొలిసారి. జనవరి- మార్చి నెలల్లోనే 5,423 మంది ఉద్యోగులు తగ్గారు.

గత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ సామర్థ్య వినియోగం ట్రెయినీలతో కలిపి 77 శాతంగా ఉంది. అప్పటి వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నామని.. ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ జయేశ్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు మారడంతో.. దానికి అనుగుణంగా పలు మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగ సామర్థ్య వినియోగం 82-83 శాతానికి పెరిగిందని అన్నారు. వలసల రేటు తగ్గడానికి కారణం ఉద్యోగ సామర్థ్య వినియోగం  అని తెలిపారు.

Also Read: Elon Musk: మోదీతో ఎలాన్ మస్క్ భేటి.. భారత్‌లో 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..!

వాటాదారులకు అధిక లాభాలు అందించేందుకే నిధుల అవసరాలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే అయిదేళ్ల కోసం (2024-25 నుంచి 2028-29 వరకు) మూలధన కేటాయింపు విధానాన్ని బోర్డు ఆమోదించినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ విధానంలో వాటాదారులకు 85% ప్రతిఫలాన్ని పంచాలని కంపెనీ భావిస్తోంది. వార్షిక డివిడెండును కూడా పెంచుకుంటూ వెళ్లాలని అనుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 1-3 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News