BigTV English

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

BSNL Rs 1499 Plan:

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం అయిన BSNL.. తమ వినియోగదారులకు చక్కటి బెనిఫిట్స్ అందించేలా క్రేజీ ప్లాన్స్ పరిచయం చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలకు సాధ్యం కాని రీతిలో తక్కువ ధరలకే ఆహా అనిపించే ప్రయోజనాలను అందిస్తోంది. తమ వినియోగదారులను ఆకట్టుకుంటూనే, కొత్త కస్టమర్లను సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. BSNLకు సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4G సేవలకు కొనసాగుతున్నప్పటికీ మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే మంచి ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. అన్ లిమిడెట్ కాల్స్ తో పాటు డేటానుకు కూడా అందిస్తోంది.


BSNL రూ. 1499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా మొత్తం 336 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాదు, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, 24 GB ఫెయిర్ యూసేజ్ పాలసీ(FUP) డేటాను కూడా అందిస్తుంది. అయితే, ఈ FUP డేటా అయిపోతే, అదనపు డేటా వోచర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్స్ లో ఇదే బెస్ట్ ప్లాన్ అంటున్నారు నిపుణులు. ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోల్చితే BSNL తీసుకొచ్చిన ఈ ప్లాన్ అత్యంత చౌకైనది మాత్రమే కాదు, మంచి ప్రయోజనాలను అందిస్తుందంటున్నారు.

Read Also: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్.. రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!


17 రోజుల కోసం రూ. 99.. 90 రోజుల కోసం రూ. 439 ప్లాన్

ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ప్లాన్ కోసం రూ. 1499 చెల్లించాలని భావించరు. అందుకే, డేటా అవసరం లేదు, కాల్స్ వచ్చి, వెళ్తే సరిపోతుంది అనుకునే వారికి BSN మరింత సరసమైన ఆప్షన్లు అందిస్తోంది. వాయిస్ కాలింగ్, SMS ప్రయోజనాలను మాత్రమే కోరుకుంటే,  BSNL అందించే రెండు ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి రూ. 99 ప్లాన్, మరొకటి రూ. 439 ప్రీపెయిడ్ ప్లాన్ వాయిస్ ఓన్లీ వోచర్లు. రూ. 99 ప్లాన్ 17 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ. 439 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రెండు ప్లాన్‌ లు కస్టమర్లకు డేటా ప్రయోజనాలను అందించవు. నిజానికి, రూ.99 ప్లాన్‌ తో, వినియోగదారులకు SMS ప్రయోజనాలు లభించవు. అయితే, మీరు 1900 కు పోర్ట్ అవుట్ సందేశాన్ని పంపాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు. కానీ బేసిక్ SMS ఛార్జీలు వర్తిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలకు ఈ ప్లాన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా ఎందుకు ఆలస్యం.. వెంటనే ట్రై చేయండి.

Read Also:  డిమార్ట్‌ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్‌ గా కొనేయొచ్చు?

Related News

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×