Investing Tips: కోటీశ్వరులు కావాలని అనేక మంది ఆశిస్తుంటారు. కానీ అనేక మంది చాలా కష్టమని భావిస్తుంటారు. కానీ మీరు చిన్న చిన్న సేవింగ్స్ చేయడం ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు. సరైన ప్రణాళిక, కృషి, స్థిరమైన ఆదాయంతో సేవింగ్స్ చేస్తే ఈజీగా మిలియనీర్ అవ్వొచ్చు. మీరు కేవలం సంపాదనపై మాత్రమే కాకుండా, సంపదను సురక్షితంగా పెట్టుబడులు చేయడం ద్వారా దీర్ఘ కాలంలో పెద్ద మొత్తాలను పొందవచ్చు. అందుకోసం మీ ఆదాయ వనరులను సరిగ్గా విస్తరించుకోవాలి.
మీరు మంచి మొత్తాలను దక్కించుకోవాలంటే, సరైన వ్యూహాలను అమలు చేస్తూ, మీ లక్ష్యం కోసం ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ క్రమంలో సరైన మార్గదర్శకాలు పాటిస్తూ, నిబద్ధతతో మీరు కృషి చేస్తే ఎవరైనా కూడా సులభంగా కోటీశ్వరులు కావచ్చు. అయితే ఇక్కడ కేవలం కోటీ రూపాయల గురించి మాత్రమే కాదు. మీరు కేవలం రూ. 4700 నెలకు సేవ్ చేయడం ద్వారా, కొన్నేళ్ల వ్యవధిలో రూ. 4 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అవును మీరు చదివింది నిజమే. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు 4 కోట్ల రూపాయల మొత్తం కోసం దీర్ఘకాలంలో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. అందుకోసం మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడులు (Systematic Investment Plan) మంచి ఎంపికగా ఉంటాయి. ఈ క్రమంలో మీరు ప్రతి నెలకు రూ. 4,700 సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఆ క్రమంలో మీరు 33 సంవత్సరాలపాటు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా 33 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 4,04,67,951. అంటే ఇక్కడ మీరు చేసే పెట్టుబడి కేవలం రూ. 18,61,200 మాత్రమే. కానీ మీకు మాత్రం వడ్డీ రూపంలోనే రూ. 3,86,06,751 లభిస్తాయి. 33 ఏళ్ల కాలంలో మీరు 15% వార్షిక వడ్డీతో మీ పెట్టుబడులు క్రమంగా పెరిగి 4 కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. సాధారణంగా సిప్ విధానంలో వార్షిక రాబడులు 12 నుంచి 19 శాతం వరకు లభిస్తున్నాయి.
Read Also: Investment Tips: రోజు జస్ట్ రూ. 100 సేవింగ్.. కోటి రూపాయల రాబడి, ఎలాగంటే..
అయితే ఈ పెట్టుబడులను మీరు ఉద్యోగంలో చేరిన తక్కువ వయస్సులోనే ప్రారంభించుకుంటే, దీర్ఘకాలంలో భారీ మొత్తాలను దక్కించుకోవచ్చు. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయస్సులో ఈ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 58 సంవత్సరాలు వచ్చే సరికి మీకు 4 కోట్ల రూపాయలు అందుతాయి. ఆ మొత్తాలను మీ పిల్లల పెళ్లి లేదా ఇంటి కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
సిప్‌లో పెట్టుబడులను మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నప్పుడు చేస్తే ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. ఆ క్రమంలో తర్వాత మార్కెట్ స్థితి పెరిగితే మీరు చేసిన పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు నిరంతరం సిప్ వంటి సమర్థవంతమైన పెట్టుబడులు మీకు భారీ మొత్తాలను అందిస్తాయి.
గమనిక: స్టాక్ మార్కెట్లో లేదా మ్యాచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు చేయాలని బిగ్ టీవీ సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. ఈ పెట్టుబడులపై మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తప్పక తీసుకోవాలి.