Pak Train Hijack Video : పాకిస్తాన్ లోని బెలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ పోరాట దళాలు.. ఫిబ్రవరి 11న మంగళవారం నాడు జాఫర్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసింది. నైరుతి బలూచిస్తాన్‌లో రైలును స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారుల బృందం.. ఆ ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో.. బలూచ్ ఆర్మీ ఏ తీరుగా రైలను, అందులోని సైన్యాన్ని, ప్రజల్ని అదుపులోకి తీసుకున్నదీ స్పష్టంగా తెలుస్తోంది. 1 నిముషం 23 సెకన్ల వీడియోలో రైలును స్వాధీనం చేసుకున్న విజువల్స్ ఉన్నాయి.
పర్వతాల సానువుల గుండా వెళుతున్న రైలు ట్రాకుపై బాంబు అమర్చిన తిరుగుబాటు దారులు.. రైలు ఇంజిన్ అక్కడకు రాగానే పేల్చేశారు. పేలుడు దాటికి పట్టాలు తప్పగా, రైలు నిలిచి పోయింది. దాంతో.. ప్రయాణికులు రైలు నుంచి దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) విడుదల చేసిన వీడియో చూపిస్తుంది.
పర్వతాల్లోని ఓ సొరంగం ప్రవేశం దగ్గరకు చేరుకోగానే.. రైలును స్వాధీనం చేసుకోగా, అప్పటికే అందులో 450 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా.. ఇప్పటికీ బలూచిస్తాన్ ఆర్మీ చేతిలో బంధీలుగానే ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే రైలు ప్రయాణికులను రక్షించడానికి పాకిస్తాన్ భద్రతా దళాలు పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభించాయి. కాగా.. ఈ ప్రాంతంలో ఉన్న ఘర్షణల కారణంగా.. ప్రతీ రైలులో సాయుధులైన జవాన్లు కాపలాగా ఉంటున్నారు. వారిలో ఆరుగురిని కాల్చి చంపిన బలూచ్ ఆర్మీ.. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సమయంలో.. బంధీలను ఒక్కచోటకు చేర్చి.. తుపాకులు పట్టుకుని తిరుగుబాటుదారులు వారిని కాపలా కాస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ బంధీలను విడుదల చేయాలంటే.. తిరుగుబాటుదారుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే పాక్ సైన్యం, భద్రతా దళాల చెరలోని తిరుగుబాటుదారుల్ని విడుదల చేయాలని.. అప్పుడే తమ అధీనంలోని సైనికుల్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే.. రెండు రోజుల వ్యవధిలో బంధీ చేసిన రైలు నుంచి 190 మంది బందీలను విడిపించగలిగారు. మంగళవారం విడుదలైన ప్రయాణీకులు.. పర్వత ప్రాంతాల గుండా గంటల తరబడి నడిచారు. వారి బాధల గురించి వివరించేందుకు, ఎలా తప్పించుకోగలిగారో తెలిపేందుకు.. మాటలు రావడం లేదంటూ విడుదలైన వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి గురించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెంటనే ప్రకటించింది.
పేదరికంలోని బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా స్వాతంత్ర్యం పోరాటం సాగుతోంది. ఇక్కడి తిరుగుబాటు దారులు.. పాకిస్తాన్, చైనాకు సంబంధించిన ప్రాజెక్టులు, దళాలతో విపరీతంగా పోరాడుతున్నాయి. గతంలోనూ వీరి కదలికలు ఉన్నప్పటికీ.. 2021లో అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బెలూచ్ ఆర్మీ కార్యక్రమాలు పెరిగిపోయాయి. ఫ్ఘనిస్తాన్‌తో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలలో హింస పెరిగింది. ఈ ప్రాంత సహజ వనరులను బయటి వ్యక్తులు దోపిడీ చేస్తున్నారని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పాకిస్తానీలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగాయని BLA ఆరోపిస్తోంది.
Also Read : Top 10 Wealthiest Countries : ఈ దేశాల్లో ఒక్కొక్కరి ఆదాయం తెలిస్తే.. మీకు అక్కడికి వెళ్లాలనిపిస్తుంది
గత సంవత్సరం తిరుగుబాటుదారులు రాత్రిపూట దాడులు చేశాయి. అందులో ఒక ప్రధాన రహదారిని తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఇతర జాతుల ప్రయాణికులను కాల్చి చంపడం వంటివి ఉన్నాయి. ఇవి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. పంజాబీ, సింధీ కార్మికులను తరచుగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. అలాగే భద్రతా దళాలు, విదేశీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా బెలూచ్ ఆర్మీ భారీగా దాడులకు పాల్పడుతోంది.