గుడ్లు అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని పవర్ ప్యాక్డ్ సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఉడకబెట్టిన గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎగ్ ఫ్రై చేసి తినడం కంటే ఉడికించి తింటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, గుడ్డును ఉడికించడం అనేది చాలా రిస్కీ వ్యవహారంగా భావిస్తారు కొంతమంది. స్టౌ మీద నీళ్లు పోసి, అందులో ఎగ్స్ వేసి ఉడికించడం వరకు ఓకే. కానీ, పెంకు తీయడానికి చాలా ఇబ్బంది పడుతారు. కానీ, ఈ టిప్ తెలిస్తే సింఫుల్ గా గుడ్డు మీద పెంకు తీసే అవకాశం ఉంది. ఇంతకీ అది ఏంటంటే..
ఉడికించిన గుడ్డు మీద పెంకు సింఫుల్ గా తియ్యండిలా!
ముందుగా స్టౌ మీద పాత్ర పెట్టి.. అందులో వాటర్ పోయాలి. అందులో గుడ్లు వేయాలి. ఆ తర్వాత ఇందులో ఓ నిమ్మకాయ ముక్క వేయాలి. సుమారు 15 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. గుడ్డు మీది పెంకు మెత్తగా మారిపోతుంది. సింఫుల్ గా ఇలా లాగేస్తే ఊడి వస్తుంది. ఎన్ని గుడ్ల పెంకులైనా క్షణాల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇకపై మీరు కూడా గుడ్లు ఉడికించే సమయంలో ఈ టిప్ పాటించండి. ఈజీగా గుడ్డు పెంకులు తీయండి.
ఉడికించిన గుడ్లతో లాభాలు!
ఉడికించిన గుడ్డుతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గుడ్డులో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో కండరాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉడికించిన గుడ్డులోని ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, యాంటీ యాక్సిడెంట్లతో పాటు పలురకాల విటమిన్లు ఉంటాయి. ఉడికించిన గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్స్ తో పాటు ఇరత పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఉడికించిన గుడ్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఉడికించిన గుడ్డు తినడం వల్ల బరువును కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకున్న అసలు కథ ఏంటి?
ఆరోగ్యానికి ఎంతో మేలు
ఉడికించిన గుడ్లు మెదడు ఆరోగ్యానికి చాలా లాభం చేస్తాయి. ఇందులో కోలిన్ అధికంగా ఉంటుంది. ఈ పదార్థం మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు చురుగ్గా పని చేయడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఉడికించిన గుడ్లు సాయపడుతాయి. గుడ్లలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చడంలో సాయపడుతాయి. గుడ్డులోని యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాలు పెరగడానికి కారణం అవుతాయి. ఉడికించిన గుడ్డు పచ్చసొన తినడం వల్ల లుటిన్, జియాక్సంతిన్ లాంటి పోషకాలు అందుతాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతాయి. సో, ఎక్కువగా ఉడికించిన గుడ్డును మాత్రమే తినేందుకు ప్రయత్నించండి.
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!
Read Also: హైదరాబాద్ మెట్రోలో చేతులు పట్టుకున్న జంట.. ఇది అమెరికా కాదంటూ క్లాస్!