IRCTC & IRFC: దేశంలో మరో రెండు సంస్థలు అరుదైన ఘనతను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) నవరత్న హోదాను పొందాయి. సోమవారం (మార్చి 3) IRCTC, IRFCలను నవరత్న సెంట్రల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.
The Government has approved the upgradation of Indian Railway Catering and Tourism Corporation (IRCTC) to Navratna CPSE, making it the 25th #Navratna among CPSEs! IRCTC is a Ministry of Railways CPSE with an annual turnover of ₹4,270.18 Cr, PAT of ₹1,111.26 Cr and a net worth… pic.twitter.com/1jhJ6iQTMk
— Department of Public Enterprises (@DPE_GoI) March 3, 2025
దీంతో IRCTC నవరత్న హోదా పొందిన 25వ కంపెనీ కాగా, IRFC 26వ కంపెనీగా అవతరించింది. భారత ప్రభుత్వం ఆయా కంపెనీల ఆర్థిక పనితీరు, నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాను మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో IRCTC-IRFC ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి ఇతర నవరత్న కంపెనీలలో చేరాయి.
The Government has approved the upgradation of Indian Railway Finance Corporation (IRFC) to Navratna CPSE, making it the 26th #Navratna among CPSEs! IRFC is a Ministry of Railways CPSE with an annual turnover of ₹26,644 Cr, PAT of ₹6,412 Cr and a net worth of ₹49,178 Cr for FY… pic.twitter.com/fNxXzqyyRi
— Department of Public Enterprises (@DPE_GoI) March 3, 2025
గత సెప్టెంబర్ ప్రారంభంలో సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, రైల్‌టెల్ కార్పొరేషన్‌లకు ‘నవరత్న’ హోదా లభించింది. జూలై 2024లో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ను నవరత్న కంపెనీల జాబితాలో చేర్చారు.
Read Also: Xiaomi 15: షియోమీ 15 అల్ట్రా రిలీజ్ డేట్ ఫిక్స్.. 200MP కెమెరాతోపాటు మరిన్ని ఫీచర్లు..
2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) IRCTC లాభం గత సంవత్సరంతో పోలిస్తే (YoY) 14% పెరిగి రూ. 341 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 300 కోట్లుగా ఉంది. అయితే కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన చూసినా కూడా 10% పెరిగింది. Q3 FY25లో కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం రూ. 1,224.7 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ 1,115.5 కోట్లు కలదు. ఫిబ్రవరి 11న IRCTC తన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే మినీ రత్న (కేటగిరీ-I) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. IRCTCని భారతీయ రైల్వేలో ఒక విభాగంగా 1999 సెప్టెంబర్ 27న ఏర్పాటు చేశారు. ఇది స్టేషన్లు, రైళ్లు, ఇతర ప్రదేశాలలో క్యాటరింగ్, ఆతిథ్యం వంటి సేవలను అందిస్తుంది. దీంతో పాటు బడ్జెట్ హోటళ్లు, ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందించడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.