Manchu Lakshmi: మంచు కుటుంబంలో జరిగిన వివాదం గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తుల వివాదంగా మొదలయిన ఈ గొడవ.. మెల్లగా సోషల్ మీడియాలో, ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ గొడవ వల్ల మంచు కుటుంబం రెండుగా చీలిపోయిందని, మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపు అని, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు అని వార్తలు వినిపించాయి. కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ విషయంపై ఓపెన్‌గా స్పందించడం గానీ, అందరి ముందు వచ్చి మనోజ్‌కు సపోర్ట్ చేయడం గానీ చేయలేదు. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లిరోజు సందర్భంగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్‌తో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది.
మనోజ్ కోసం ఏదైనా
మంచు విష్ణు కంటే మనోజ్ అంటేనే తనకు చాలా ఇష్టమని, తనను కొడుకులాగా భావిస్తానని మంచు లక్ష్మి ఎన్నోసార్లు బయటపెట్టింది. అందుకే మనోజ్ ఏం చేసినా లక్ష్మి సపోర్ట్ తనకు ఉండేది. పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది. మంచు మనోజ్‌కు ఇదివరకే పెళ్లయ్యింది. కానీ తనతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న చాలా ఏళ్ల తర్వాత రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికను ప్రేమించాడు మనోజ్. అయితే పలు కారణాల వల్ల మనోజ్, మౌనికల పెళ్లిని మంచు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో కూడా మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి మనోజ్ పెళ్లి చేసింది. ఇప్పుడు పెళ్లిరోజుకు కూడా తను మాత్రమే విషెస్ చెప్పింది.
టీజర్‌కు నో రెస్పాన్స్
మనోజ్ కోసం మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్ బాబు (Mohan Babu)ను కూడా మంచు లక్ష్మి దూరం పెట్టిందా అని ప్రేక్షకుల్లో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే మంచు విష్ణు కష్టపడి రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టి ‘కన్నప్ప’ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. చాలామంది సినీ ప్రముఖులు ఈ టీజర్‌ను ప్రశంసించారు. కానీ మంచు లక్ష్మి (Manchu Lakshmi) మాత్రం ఈ టీజర్‌ను అస్సలు పట్టించుకోలేదు. దాని గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. అలాంటి మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి యానివర్సరీ అనగానే ట్వీట్ చేసి విషెస్ చెప్పింది. దీంతో మంచు లక్ష్మి పూర్తిగా మనోజ్ సైడే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read: చిరంజీవికి గట్టి కౌంటర్ వేసిన కిరణ్ బేడీ.. ఇకనైనా కళ్లు తెరవండి అంటూ ఘాటు పోస్ట్
పెళ్లికి అంగీకరించలేదు
మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) ప్రేమించుకోవడం మొదలుపెట్టిన తర్వాత కూడా చాలాకాలం వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం చెప్పలేదు. అందుకే పెళ్లి చేసుకోకుండానే వారి అంగీకారం కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూశారు. మొత్తానికి మంచు కుటుంబం నుండి లక్ష్మి చొరవ వల్ల మోహన్ బాబు ఈ పెళ్లికి హాజరయ్యాడు. కానీ మంచు విష్ణు మాత్రం కనీసం పెళ్లికి రాకుండా, తన తమ్ముడిని విష్ చేయకుండా ఉండిపోయాడు.
Wishing you a lifetime of love, my M&M 🥰✨❤️@HeroManoj1 pic.twitter.com/eHWRjlxHFy
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2025