Tollywood : టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమధ్య డ్రగ్స్ కేసులు అంటూ వార్తల్లో నిలుస్తుంది తప్ప అప్పట్లో వరుసగా ఎన్నో హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డ్రగ్స్ కేసు ఇష్యూ తరువాత నటి హేమ మీడియాకి కాస్త దూరంగానే ఉంటున్నారు.. ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత పెద్దగా బయట కూడా కనిపించలేదు. ఇప్పటికీ నటి హేమ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి రాలేదు. కానీ తాజాగా మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది. తన పరువు తీశారంటు కొందరికి లీగల్ నోటీసులు పంపించారు..
కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి హేమ షాక్..
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు నటి హేమ దిమ్మ తిరిగే షాకిచ్చింది. తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హేమ లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు.. రెండు యూట్యూబ్ ఛానెల్స్ పైనా చట్టపరమైన చర్యలకు సిద్దమైంది హేమ. లాస్ట్ టైమ్ నేను ఓ ఇష్యూలో ఉన్నా. నాపై బుదర చల్లే ప్రయత్నం చేశారు. దానిపై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా. నా పరువుకు నష్టం కలిగింది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చా. మాటల్లో కాకుండా ఈసారి న్యాయస్థానానికి వెళ్లా. సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. నాలా మరొకరికి జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కొంతమంది అడ్రస్‌లు తెలియలేదు. నాపై మీడియాలోనే అసభ్యంగా మాట్లాడారు.. నోరు ఉంది కదా అనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఆమె అంటున్నారు. నాపై వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియోలన్నీ నెట్‌లో కొడితే వస్తున్నాయి. నేను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యా. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకే లీగల్ నోటీసులు ఇస్తున్నా అని హేమ పేర్కొన్నారు. ఆ రెండు యూట్యూబ్ ఛానెల్స్ ఏంటనేది తెలియాల్సి ఉంది.
హేమ సినిమాల విషయానికొస్తే..
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500 పైగా చిత్రాల్లో నటించారు. హేమ అసలు పేరు కృష్ణవేణి. ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. సినిమాలపై ఉన్న ఆసక్తిగా ఇండస్ట్రీ వైపు వచ్చిన హేమ.. సీరియల్స్‌లో కూడా నటించింది. 1989 లో చిన్నారి స్నేహం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె, ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఆమె చివరిగా 2023లో వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో కనిపించింది.. ఈమధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఈమె, ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కేసు నుంచి మా ఇంకా బయటపడలేదని తెలుస్తుంది. ఇప్పుడు తనపై అసత్యపు ప్రచారం చేసినందుకుగాను పని యూట్యూబ్ ఛానల్స్ పై అలాగే కొందరు నటులకు లీగల్ నోటీసులు పంపించింది.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మరి నోటీసులపై వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..