Highest Salary In The World: గత కొంతకాలంగా భారతీయులు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నారు. పలు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఈసీవోలుగా ఎంపిక అవుతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అగ్రశ్రేణి సంస్థలను లీడ్ చేస్తున్నారు. వార్షిక వేతనం పొందడంలోనూ సత్తా చాటుతున్నారు. ప్రపంచంలోని మరే ఇతర వ్యక్తులకు సాధ్యం కాని రీతిలో సాలరీ తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా ఓ భారతీయుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఎవరో కాదు జగదీప్ సింగ్. తన వార్షిక వేతనం రూ. 17,500 కోట్లు.
ఇంతకీ ఎవరీ జగదీప్ సింగ్?
భారత సంతతికి చెందిన జగదీప్ సింగ్ ప్రపంచంలోనే ఎక్కువ జీతం తీసుకునే సీఈవోగా గుర్తింపు పొందారు. ఆయన క్వాంటం స్కేప్ టెక్ సంస్థ వ్యవస్థాపకుడు. సీఈవోగానూ కొనసాగారు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీపై పని చేస్తున్నది. జగదీప్.. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్పేస్ ఎక్స్ లాంటి సీఈవోలు కూడా పొందలేనంత వేతనాన్ని పొందుతున్నారు. ఆయన వార్షిక వేతనం 17,500 కోట్లు. అంటే, నెలకు రూ. 1,458 కోట్లు తీసుకుంటున్నారు. రోజుకు ఆయన సంపాదన రూ. 48 కోట్లు కావడం విశేషం.
జగదీప్ సింగ్ కెరీర్..
జగదీప్ సింగ్ అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని తీసుకున్నారు. హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బర్కిలీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి MBA పట్టాను కూడా అందుకున్నారు. జగదీప్ 2010లో క్వాంటం స్కేప్ ను స్థాపించడానికి ముందు, సన్ మైక్రోసిస్టమ్స్, సియెనా లాంటి కంపెనీలలో పని చేశాడు. పలు కంపెనీలలో పలు పొజిషన్లలో పని చేసి తన స్కిల్స్ పెంచుకున్నారు. ఆ తర్వాత AirSoft, Lighters Networks, Infinera లాంటి కంపెనీలను స్థాపించారు. ఎలక్ట్రిక్ బ్యాటరీ టెక్నాలజీని మరింత డెవలప్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా EV పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆయన స్థాపించిన క్వాంటం స్కేప్ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. ఈ టెక్ కంపెనీలో ఫోక్స్ వ్యాగన్, మైక్రోసాఫ్ట్ మాజీ CEO బిల్ గేట్స్ లాంటి వ్యక్తులకు పేర్లు ఉండటం విశేషం.
2024లో సీఈవో పదవికి రాజీనామా
జగదీప్ సింగ్ 2024లో క్వాంటం స్కేప్ సీఈఓ పదవికి రిజైన్ చేశారు. ఆయన తన స్థానంలో శివ రామ్ ను సీఈవోగా నియమించారు. జగదీప్ సింగ్ ఇప్పుడు ‘స్టెల్త్ స్టార్టప్’ కంపెనీని స్థాపించి, దానికి CEOగా కొనసాగుతున్నారు. అటు క్వాంటం స్కేప్ సంస్థ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. నేపథ్యంలో ఆయనకు భారీ వేతనం చెల్లించేందుకు వార్షిక వాటాదారుల సమావేశం అంగీకరించింది. సింగ్ పనితీరు ఆధారంగా షేర్ హోల్డర్లు ఈ రెమ్యునరేషన్ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగదీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వార్షిక వేతనం తీసుకుంటున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ మూలాలున్న వ్యక్తి ఈ ఘనత సాధించడం పట్ల ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు షాకిచ్చిన ఎక్స్.. మస్క్ అంటేనే పక్కా కమర్షియల్ మరి!