BigTV English

Jeep Compass Night Eagle Edition Launched: అద్భుతమైన లుక్‌తో జీప్ 2024 కంపాస్ నైట్ ఈగిల్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్స్.. ధర..?

Jeep Compass Night Eagle Edition Launched: అద్భుతమైన లుక్‌తో జీప్ 2024 కంపాస్ నైట్ ఈగిల్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్స్.. ధర..?

Jeep Compass Night Eagle Edition Launched: మార్కెట్‌లోకి మరో అద్భుతమైన ఫీచర్లతో కొత్త కార్ లాంచ్ అయింది. ఈ కారు లుక్, డిజైన్‌తో వాహనప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ తన 2024 కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ రూ.25.39 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో రిలీజ్ అయింది. ఈ ఎడిషన్ రీసెంట్‌గా విడుదల అయిన MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్, టాటా హారియర్ డార్క్ ఎడిషన్, మహీంద్రా XUV700 నాపోలి బ్లాక్ ఎడిషన్‌లతో పోటీపడుతుంది. కాగా ఈ నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్‌ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.


అందువల్ల ఆసక్తిగల వాహన ప్రియులు ఆన్‌లైన్‌లో, దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్.. బ్లాక్, రెడ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటికీ నల్లటి పైకప్పును కలిగి ఉంది. ఈ ఎడిషన్ లోపల, బయట కొన్ని కాస్మెటిక్ ట్వీక్‌లను మాత్రమే కాకుండా.. మరికొన్ని యాడ్-ఆన్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

అలాగే ఇది గ్లోస్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, డోర్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇవి దాని స్పోర్టీ లుక్‌ను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఇది బ్యాక్ సీటు ప్రయాణీకుల కోసం డాష్‌క్యామ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌తో సహా మరికొన్ని అదనపు ఫీచర్లను కూడా పొందింది.అలాగే యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి మద్దతునిస్తూ.. అన్‌కనెక్ట్‌-5తో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.


Also Read: ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!

ఇది కాకుండా.. ఈ కొత్త ఎడిషన్‌లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, 9స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త కంపాస్ నైట్ ఈగిల్ కార్ 2.0 లీటర్ల టర్బో డీజిల్ ఇంజన్‌ను పొందింది. ఇది 168bhp పవర్‌ని, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందించారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×