BigTV English

CM Jagan Key Decisions Kadapa Candidate: చెల్లెళ్లు ఎఫెక్ట్.. సర్వేలో నెగిటివ్.. అభ్యర్థుల్లో మార్పు..?

CM Jagan Key Decisions Kadapa Candidate: చెల్లెళ్లు ఎఫెక్ట్.. సర్వేలో నెగిటివ్.. అభ్యర్థుల్లో మార్పు..?

CM Jagan Changing Kadapa MP Candidate: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ నేతలకు టెన్షన్ మొదలైంది. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కూటమి సభలకు వస్తున్న జనం చూసి వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. అభ్యర్థులపై ఏమైనా నెగిటివ్ ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారట సీఎం జగన్. ఇందులోభాగంగానే సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. చాలా చోట్ల అభ్యర్థులు రెండు లేదా మూడో స్థానానికి పడిపోయారట. ఈ క్రమంలో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


తొలుత కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌‌రెడ్డిని మారుస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా వారం రోజులపాటు చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత ప్రచారం చేయడంతో ప్రజల్లో మూడ్ మారిందని టాక్.  వైసీపీ నేరస్థులకు టికెట్లు ఇచ్చిందని, ఇలాంటి వ్యక్తులు చట్టసభలకు అవసరమా అంటూ చెల్లెళ్లు ప్రశ్నించా రు. ఈ క్రమంలో ఫ్యాన్ పార్టీ చేయించిన సర్వేలో అవినాష్‌రెడ్డి థర్డ్ ప్లేస్‌కి పడిపోయాడని సమాచారం. దీంతో అక్కడ అభ్యర్థిని మార్చేపనిలో నిమగ్నమయ్యారట. వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనవడు అభిషేక్‌రెడ్డి రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కడప బాధ్యతలు అభిషేక్‌కే జగన్ అప్పగించారని అక్కడి స్థానిక నేతలు చెబుతున్నారు.

జగన్ ఫ్యామిలీకి కడప జిల్లా కంచుకోట. కడపలో ఓడిపోతే తలెత్తుకుని తిరగలేమని భావించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నేతలు చెబుతున్నారు. ఇదేకాకుండా కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్ టాక్. ఈ క్రమంలో మైలవరం నుంచి మంత్రి జోగి రమేష్, విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్, గుంటూరు వెస్ట్ నుంచి కిలారు రోశయ్యలను బరిలో దింపాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.


Also Read: Sharmila, Sunitha shocking comment: జగన్‌పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!

మంత్రి విడదల రజినీకి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి వైసీపీలో ఇంకెంత మంది అభ్యర్థులు మారుతారో చూడాలి. తొందరగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని అభ్యర్థులు అంటున్నారు. మరి అభ్యర్థుల మార్పు ఏంటో గానీ..  సీఎం జగన్ ముఖం మాత్రం చాలా డల్‌గా ఉందని పార్టీ నేతలే చెప్పుకోవడం గమనార్హం.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×