BigTV English

Ismail Haniyeh: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి!

Ismail Haniyeh: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి!
Ismail Haniyeh 3 Sons Killed in Israeli Strike: ఇటీవల గాజా స్ట్రిప్‌లో జరిపిన వైమానిక దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ముగ్గురు కుమారులు మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు బుధవారం ధృవీకరించాయి.


ట్విటర్ వేదికగా IDF హనియే ముగ్గురు కుమారులు — అమీర్, హజెమ్, మహ్మద్ — సెంట్రల్ గాజా ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు దాడి చేసినట్లు పేర్కొంది.

ఇస్మాయిల్ హనియే కూడా, అల్ జజీరా శాటిలైట్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన నలుగురు కుమారులలో ముగ్గురు “జెరూసలేం, అల్-అక్సా మసీదును విముక్తి చేసే మార్గంలో అమరులయ్యారు” అని చెప్పారు.


“శత్రువు ప్రతీకారం, హత్యాస్ఫూర్తితో నడుస్తాడు. ఎటువంటి ప్రమాణాలు లేదా చట్టాలకు విలువ ఇవ్వడు” అని అతను ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. వీడియో రిలీజ్

ఇస్మాయిల్ హనియే ఖతార్‌లో నివసిస్తున్నాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరం సమీపంలో జరిగింది. కాగా హనియే గాజా ప్రాంతానికి చెందినవాడు.

IDF ప్రకారం, అమీర్ హనియే హమాస్ మిలిటరీ విభాగంలో స్క్వాడ్ కమాండర్, హజెమ్, మొహమ్మద్ హనియే కింది స్థాయి కార్యకర్తలు.

ఇంతలో, ఇజ్రాయెల్ డ్రోన్ లక్ష్యంగా చేసుకున్న ఒకే వాహనంలో సోదరులు కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నారని హమాస్ అల్-అక్సా టీవీ స్టేషన్ పేర్కొంది. హజెమ్ హనియే కుమార్తె, అమీర్ కుమారుడు, కుమార్తెతో సహా మొత్తం ఆరుగురు మరణించారని టీవీ స్టేషన్ తెలిపింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×