Jeff Bezos Property Sale: సముద్రతీరాన ఒక అద్భుతమైన భవనం…లోపలికి అడుగుపెడితే మెరిసే ఇంటీరియర్ డిజైన్, బయటికి చూసినప్పుడు నీలి సముద్రపు అందాలు. ఇంత అద్భుతమైన ఇంటిని ఎవరు వదులుకుంటారు? అదీ కూడా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లాంటి బిలియనీర్ అయితే ఇంకేమైనా కారణం ఉండాల్సిందే. సియాటిల్‌లో ఉన్న ఈ విలాసవంతమైన భవనాన్ని ఆయన ఇటీవల రూ.538 కోట్లు అంటే సుమారుగా 63 మిలియన్ డాలర్లకు విక్రయించారు. కానీ ఈ అమ్మకంలో అసలు మజా ఏంటంటే… ఇది ఒక సాదా డీల్ కాదు, ఇందులో ఉన్న రహస్యాలూ, వ్యూహాలూ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
జెఫ్ బెజోస్ క్లాస్
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు కాగా, ఇటీవల సియాటిల్ మాన్షన్‌ను విక్రయించారు. ఇది వాషింగ్టన్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నివాసంగా రికార్డు సృష్టించింది. మొత్తం ధర? అక్షరాలా 63 మిలియన్ డాలర్లు, అంటే మన రూపాయల్లో రూ. 538 కోట్లకు పైగా ఉంది. ఈ ఇంటి కొనుగోలుదారు ఎవరో కాదు కయాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLC, ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్.
ఈ ఇంటి ప్రత్యేకత ఏంటి?
ఈ మాన్షన్ సుమారు 9,420 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎలైట్ హంట్స్ పాయింట్ అనే హై-ప్రొఫైల్ ప్రాంతంలో ఉంది. మొత్తం 3.27 ఎకరాలు విస్తరించిన ఈ భవనం అమెజాన్ ప్రధాన కార్యాలయం, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ మొదలైన టెక్ జెయింట్స్‌కు దగ్గరగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఇంటికి లేక్ వాషింగ్టన్ 300 అడుగుల దూరంలో వాటర్‌ఫ్రంట్ యాక్సెస్ ఉంది.
Read Also: Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్.. …
రూ. 200 కోట్లు లాభం
ఈ భవనం ఒకప్పుడు ప్రసిద్ధ ఆర్ట్ కలెక్టర్ బార్నీ ఎ. ఎబ్స్‌వర్త్ కు చెందినది. అతను బిల్డ్-ఎ-బేర్‌లో తొలి పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందాడు. 2019లో, బెజోస్ ఈ ఇంటిని తన మాజీ భార్య మెకెంజీ స్కాట్తో విడాకుల తర్వాత $37.5 మిలియన్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు అమ్మిన ధరను చూస్తే, అతనికి $25 మిలియన్ పైగా లాభం వచ్చినట్లే. అంటే మన రూపాయల్లో సుమారు రూ. 200 కోట్లు.
మయామికి మారిన బెజోస్
బెజోస్, అతని కాబోయే భార్య లారెన్ సాంచెజ్ గత 18 నెలలుగా మయామిలో ఉంటున్నారు. బెజోస్ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ కార్యకలాపాలను కేప్ కెనావెరల్‌కు తరలించేందుకు కూడా ఓ కారణమని అంటున్నారు.
మయామిలో ‘బిలియనీర్ బంకర్’
మయామిలో బెజోస్ కొత్త ఇంటిని చూసినవారికి ఒక్క మాటే వచ్చిందట – “ఇది బిలియనీర్‌ల కోసం నిర్మించిన బంకర్” అని! 2024లో ఆయన $90 మిలియన్లకు కొనుగోలు చేసిన ఈ భవనం:
పన్ను కారణమా?
కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నదేమిటంటే, బెజోస్ వాషింగ్టన్ నుంచి తరలిపోవడానికి ఒక కారణం 7% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయి ఉండవచ్చని. ఈ పన్నును 2023లో వాషింగ్టన్ సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే భారీగా షేర్లు విక్రయించేటప్పుడు పన్ను బిల్లులు భారీగా పడతాయి. అందుకే బహుశా, బెజోస్ మయామి అనే పన్నుల స్వర్గానికి మారిపోయారని అంటున్నారు.