BigTV English
Advertisement

Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్..ఫోన్ హీటింగ్‌ను అడ్డుకునే స్మార్ట్ టిప్స్

Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్..ఫోన్ హీటింగ్‌ను అడ్డుకునే స్మార్ట్ టిప్స్

Smartphone Overheating: సమ్మర్ టైం రానే వచ్చేసింది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మనమే కాదు, మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ కూడా ఎండ వేడికి హీట్ అవుతోంది. ఎక్కువ వేడితో బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్ వేగంగా వేడెక్కడం, పనితీరు నెమ్మదిగా మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వేసవి సెలవుల్లో లేదా ప్రయాణాల్లో మనతో పాటు ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. సూర్యుడి నుంచి దూరంగా ఉంచండి
వేసవిలో ఎక్కువ సూర్యరశ్మికి లోనవ్వడం వల్ల మన ఫోన్ వేడెక్కడమే కాకుండా, దాని లోపల ఉన్న భాగాలపై ప్రభావం పడుతుంది. పబ్లిక్ జర్నీ, బీచ్, పార్క్ వంటి ప్రదేశాల్లో స్క్రోల్ చేస్తూ ఫోన్‌ను బహిరంగంగా ఉపయోగిస్తే, నేరుగా సూర్యరశ్మి పోన్ కు తాకి అది వేడెక్కిపోతుంది. ఫోన్ వాడకపోతే బ్యాగ్‌లో ఉంచండి, అవసరమైతే కాటన్ గుడ్డలో కప్పండి. వీడియో తీస్తున్నా, గేమ్ ఆడుతున్నా… నీడే బెస్ట్ ఛాయిస్.

2. ఫోన్‌కు బ్రేక్ ఇవ్వండి
ఫోన్ ఉపయోగించకపోయినా, పలు యాప్‌లు నేపథ్యంలో పని చేస్తుంటాయి. ఇవి RAM, CPU ఉపయోగిస్తూ ఫోన్‌కు ఒత్తిడిని కల్గిస్తాయి. Recents బటన్ ద్వారా తరచూ బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయండి. అవసరం లేని యాప్‌లను డిలీట్ చేయండి. అవసరం లేని “auto sync”, “location services” కూడా ఆఫ్ చేయండి. ఇది ఫోన్ వేడి తగ్గించడమే కాకుండా బ్యాటరీని కూడా సేవ్ చేస్తుంది.


Read Also: Baba Vanga: బాబా వంగా భయానక జోస్యం..మనిషి మనసుని …

3. గేమ్స్ & స్ట్రీమింగ్‌కు బ్రేక్
వేసవిలో గేమ్స్ ఆడడం, HD వీడియోలు స్ట్రీమ్ చేయడం వల్ల మీ ఫోన్ CPU ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దీంతో ఫోన్ వేగంగా వేడెక్కుతుంది. ముఖ్యంగా PUBG, Call of Duty, Asphalt లాంటి గేమ్స్‌లో ఇది తరచూ కనిపిస్తుంది. చాలా ఫోన్లలో “Game Mode” అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయండి. గేమింగ్ టైమ్‌ను పరిమితం చేయండి. ఎక్కువసేపు ప్లే చేయకండి, మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఆడొద్దు.

4. ఫాస్ట్ ఛార్జింగ్
ఓకే, ఫాస్ట్ ఛార్జింగ్ మంచి ఫీచర్. కానీ వేసవి రోజుల్లో ఇది ఫోన్ టెంపరేచర్‌ను రెట్టింపు చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే ఫోన్ వేడెక్కి పనితీరు మందగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరమైన స్థాయికి కూడా చేరవచ్చు. ఈ క్రమంలో Settingsలోకి వెళ్లి “Fast Charging” ఆపివేయండి. సాధారణ ఛార్జర్ ఉపయోగించండి. మధ్యాహ్నం వేడిలో ఛార్జ్ చేయడం కన్నా, తెల్లవారుజామున లేదా రాత్రి సమయం బెస్ట్.

5. తాత్కాలికంగా అయినా
మీ ఫోన్‌కు ఉన్న కవర్ స్టైలిష్‌గా కనిపించవచ్చు. కానీ అది వేడి పొదిగే బ్లాంకెట్ లా పనిచేస్తుంది. సిలికాన్, ప్లాస్టిక్ కవర్స్ వాతావరణ వేడి నుంచి ఫోన్‌ను పరిరక్షించకపోయినా, ఫోన్‌లోని వేడి బయటికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాబట్టి గేమింగ్ లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ చాలా వేడిగా అనిపిస్తే, వెంటనే కవర్‌ను తొలగించండి. ఆ తరువాత ఫోన్ వేడి మామూలు స్థాయికి వచ్చే వరకు చూడండి.

అదనంగా పాటించాల్సిన కొన్ని టిప్స్
-ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ “Auto” మోడ్‌లో ఉంచండి
-పవర్ సేవింగ్ మోడ్‌ను యాక్టివేట్ చేయండి
-లైవ్ వాల్పేపర్స్‌ను తొలగించండి. ఇవి ఎక్కువ GPUని వాడతాయి
-Wi-Fi, Bluetooth అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి
-స్మార్ట్‌ఫోన్‌ను అప్పుడప్పుడు “Restart” చేయండి, ఇది తాత్కాలిక వేడిని తగ్గిస్తుంది

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×