Thug Life OTT: చాలా ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) , స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో వస్తున్న చిత్రం థగ్ లైఫ్ (Thug Life).. భారీ అంచనాల మధ్య జూన్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా నుండి ‘జింగుచా’ అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేశారు. తమిళ్లో విడుదల చేసినప్పటికీ మీనింగ్ తెలియకపోయినా.. ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) అందించిన మ్యూజిక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ పాటకి కమలహాసన్ లిరిక్స్ అందించడం జరిగింది.
ఓటీటీ రైట్స్ రూ.149.7 కోట్లు..
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఫిక్స్ అయింది. సుమారుగా రూ.149.7 కోట్ల భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసింది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన ప్లాట్ ఫామ్ విషయానికి వస్తే.. దిగ్గజ ప్లాట్ఫామ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. డిజిటల్ హక్కులే ఈ రేంజ్ లో అమ్ముడుపోయాయి అంటే, ఇక థియేట్రికల్ హక్కులు ఇంకే రేంజ్ లో అమ్ముడుపోతాయో అని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదీ కమలహాసన్ రేంజ్ అంటే అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనాభం.
స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
ఇకపోతే ఏ సినిమా అయినా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే సెప్టెంబర్ ఆఖరున అంటే దసరా సందర్భంగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, ఓవర్సీస్ లో హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏపీ లో.ఇంటర్నేషనల్ మూవీస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్, తెలుగులో శ్రేష్ట మూవీస్ వారు విడుదల చేస్తున్నారు. అటు కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఇందులో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సిడ్నీలో మ్యూజికల్ ఈవెంట్..
జస్ట్ గో ప్రొడక్షన్స్ సహకారంతో థగ్ లైఫ్ ఫెస్టివల్ ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. మే 23వ తేదీన శుక్రవారం రోజు ఆస్ట్రేలియాలోని డిస్నీలో ఈ ఈవెంట్ జరగనుంది అని సమాచారం.ఇకపోతే ఈ మ్యూజికల్ ఈవెంట్ లో ఏ ఆర్ రెహమాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు.
Kamal Haasan: ఫాన్స్ కి క్షమాపణలు చెప్పిన కమలహాసన్.. ఏం జరిగిందంటే..?