Big Stories

Medigadda Barrage: గుంతలు.. బీటలు.. ఓ మేడిగడ్డ ప్రాజెక్ట్

Medigadda Barrage latest news(TS today news): మేడిగడ్డ ఓ మేడిపండు.. యస్.. ఇది ఏదో రైమింగ్ కోసం వాడుతున్న పదాలు కాదు. మేడిగడ్డ ఓ డొల్ల అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడివి ఆరోపణలు కాదు.. నగ్న సత్యాలని తేలింది. గతంలో మొరాయించిన గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తుంటే వచ్చే శబ్ధాలు విని ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్యారేజ్‌ ఇంకేంత కుంగుతుందో అనే భయం పనులను ముందుకు సాగనివ్వడం లేదు.

- Advertisement -

నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఎక్స్‌పర్ట్ కమిటీ ఒక సూచన చేసింది. వర్షాకాలం రాకముందే మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ పైకి ఎత్తాలని చెప్పింది. లేదంటే మొత్తం బ్యారేజీకే అసలుకే మోసమని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇలా గేట్లు ఎత్తాలని ఎందుకు నిర్ణయించారో ఒకసారి గుర్తు చేసుకుందాం.. గతేడాది అక్టోబర్‌ 21న 7వ నంబర్‌ బ్లాక్‌ కుంగింది. ఈ బ్లాక్‌లోని రెండు పియర్స్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి..
దీంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను ఎత్తలేకపోయారు. కుంగిన సమయంలో నీటి లీకేజీని ఆపేందుకు ఏకంగా 40 వేల ఇసుక బస్తాలను వేశారు. అయితే ఈ గేట్లను ఎత్తడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పునాదులు ఇప్పటికే కుంగాయి.

- Advertisement -

టన్నుల బరువున్న ఈ గేట్లను ఇప్పుడు కదిలిస్తే బ్యారేజీ మరింత కుంగే ప్రమాదం.. సో పునాదులపై ఎలాంటి ప్రెజర్ పడకుండా.. క్రేన్లను ఏర్పాటు చేసి గేట్లను ఎత్తాలన్న దీనికి అనుగుణంగా 15వ నెంబర్‌ను సక్సెస్‌ఫుల్‌గా లిఫ్ట్ చేశారు. బట్‌ ఎప్పుడైతే 16వ నెంబర్ గేట్‌ను ఎత్తేందుకు ప్రయత్నించారో.. అప్పుడు శబ్ధాలు, ప్రకంపనలు మొదలయ్యాయి. ఏంటా అని చూస్తే.. అసలు కింద మొత్తం అగాథమే ఉందని తేలింది.

గుంతలు.. ఇప్పుడు మేడిగడ్డలో ఎక్కడ చూసిన కనిపిస్తున్నవి ఇవే.. వీటిని చూశాక గేట్ల పనుల విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. నిజానికి మేడిగడ్డ బ్యారేజీలో గతంలో భారీ ఎత్తున నీటిని నిల్వ చేశారు. ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది. దీంతో అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని NDSA అంచనాకు వచ్చింది. దీని సైజ్‌ ఏకంగా 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చనేది ఓ అంచనా.. అయితే ఈ అగాధం ఒకే చోట లేదు.. బ్యారేజీ పొడవులన కొన్ని చోట్ల చిన్నగా.. మరికొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయి. ఈ అగాధం కారణంగానే ఏడో బ్లాక్‌లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి. ఇప్పుడు రిపేర్లకు కూడా ఈ అగాథలే అడ్డుగా మారాయి.

Also Read: కేటీఆర్ కథే వేరు..

గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే.. ర్యాఫ్ట్‌లు డ్యామేజ్ అవుతున్నాయి. మరిప్పుడు ఏం చేయాలి? పనులు ముందుకు సాగాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ర్యాఫ్ట్ కింద భారీ గుంతలను గ్రౌటింగ్ చేస్తున్నారు. కాంక్రీట్ గ్రౌటింగ్ కోసం రెండు మిషిన్లను తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావాలంటే వారం టైమ్ పడుతుంది. ఈ పనులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితేనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా వర్షాకాలంలోపు మొత్తం గేట్లు ఎత్తాలి. లేదంటే అప్పుడు వచ్చే వరద కారణంగా మొత్తం బ్యారేజీనే దెబ్బతినే అవకాశం ఉంది. మరి గ్రౌటింగ్ పనులు ఫెయిల్ అయితే.. ఈ డౌట్ వచ్చిన ఇంజనీర్స్‌ ప్లాన్‌ బీని రెడీ చేశారు. అవసరమైతే మొత్తం గేట్‌నే తొలగించేందుకు రెడీ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది

అసలు మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో బొరియలు ఎగ్జాక్ట్‌గా ఎక్కడున్నాయి.. ? దీని కోసం ఎక్స్‌పర్ట్‌ కమిటీ మూడు సంస్థలను సూచించింది. ఆ సంస్థలతో అన్ని పరీక్షలు చేయించనున్నారు. ఆ సంస్థల రిపోర్ట్ ఆధారంగా ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని ఆ ఆగాథాల్లో నింపి.. వాటిని పూడ్చివేయనున్నారు. ఇలా ప్రెషర్ గ్రౌటింగ్ చేసిన తర్వాత గేట్లు ఎత్తే పనులు ప్రారంభం కానున్నాయి.

అసలు ప్రాజెక్టులో ఈ అగాథాలు ఎందుకు ఏర్పడ్డాయి? దీనికి ఆన్సర్ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యమే అని తెలుస్తుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ 2019లో పూర్తైంది. ఆ ఇయర్‌లో వచ్చిన వరదలకే బ్యారేజ్‌ దెబ్బతిన్నది. కానీ ఈ విషయాన్ని అప్పటి ఇంజనీర్లు గుర్తించి ప్రభుత్వానికి చెప్పినా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ప్రతి ఇయర్‌.. కొంచెం కొంచెంగా బ్యారేజ్‌ డ్యామేజ్‌ అవుతూ వస్తుంది.. చివరికి కుంగిపోయింది. ఇప్పటికీ ఈ డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. వచ్చే వర్షకాలంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఏంటన్నది ఇంజనీర్ల భయం.

అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ భవితవ్యం ఏంటి? భవిష్యత్తులో మళ్లీ అది బ్యారేజ్‌గా పనిచేస్తుందా? లేదా? సమాధానాలు రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. అయితే ఒకటి మాత్రం నిజం.. నెక్ట్స్‌ సీజన్‌కి కూడా బ్యారేజ్‌తో ఎలాంటి ఉపయోగం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News