Big Stories

Kia Carens: క్రాష్‌ టెస్ట్‌లో దుమ్ము దులిపేసిన కియా కేరెన్స్‌ .. ఆ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌

Kia Carens: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియాకు మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త కారు లాంచ్ అవుతుందంటే వాహన ప్రియులు డిలర్‌షిప్‌ల వద్దకు పరుగులు పెడుతుంటారు. ముఖ్యంగా ఈ కంపెనీ కార్ల డిజైన్, లుక్, ఫీచర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. అందువల్లనే ఈ కంపెనీ కార్లకు అంతటి క్రేజ్ ఉంది.

- Advertisement -

అయితే ఈ కంపెనీ ఇటీవలే ‘2024 కియా కేరెన్స్’ మోడల్‌కు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ను నిర్వహించింది. ఈ కారు పెద్దల భద్రతకు 3-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అలాగే పిల్లల భద్రతకు 5 స్టార్ రేటింగ్‌ను అందుకుంది. దీంతో మునుపటి రిజల్ట్స్‌తో పోలిస్తే తాజా టెస్ట్‌లో భద్రతా మెరుగుదల కనిపించినప్పటికీ, కొన్ని లోపాలు కూడా గుర్తించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పెద్దల సేఫ్టీ ప్రొటెక్షన్ విభాగంలో ఈ కారు 34.00కి గానూ 22.07 స్కోర్‌ను సాధించి 3 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకుంది. ముఖ్యంగా డ్రైవర్, ప్రయాణికుల తల భాగం మంచి రక్షణగా ఉందని నిరూపించుకుంది. అయినా సరే డ్రైవర్ మెడ భాగం సేఫ్టీలో కొంత బలహీనతను గుర్తించారు. అయినప్పటికీ డ్రైవర్, ప్రయాణికుడి తల తగినంత రక్షణను అందించింది.

Also Read: అదిరిపోయిన 6 సీటర్ కియా కేరెన్స్ అప్‌డేట్ ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

అయితే వీటితో పాటు ఈ కారు ఫుట్‌వెల్ భాగం అంతగా అనుకూలంగా లేదు.. అలాగే బాడీ షెల్ అస్థిరంగా గుర్తించబడింది. ఇక సైడ్ ఇంపాక్ట్ విషయానికొస్తే.. తల ఛాతీ, ఉదరం భాగాల్లో మంచి రక్షణను పొందింది. అలాగే డ్రైవర్, ప్రయాణీకుల మోకాళ్లకు భద్రత అంతంతమాత్రంగానే ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)ను స్టాండర్డ్‌గా అందించింది. దీంతో కియా కేరెన్స్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో వయోజన రక్షణ కోసం 3-స్టార్ రేటింగ్‌ను పొందింది.

అలాగే చిన్నపిల్లల సేఫ్టీ ప్రొటెక్షన్ పరంగా చూస్తే.. కియా కేరెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇది 49.00కి గానూ 41.11 స్కోర్‌ను అందుకుంది. దీని ఫలితంగానే ఇది 5 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. 3 ఏళ్ల పిల్లల చైల్డ్ సీట్ ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో హెడ్ ఎక్స్‌పోజర్‌ను నిరోధించగలిగింది. అలాగే 18-నెలల పిల్లల కోసం చైల్డ్ సీటు i-సైజ్ ఎంకరేజ్‌లు, సపోర్ట్ లెగ్‌ని ఉపయోగించి వెనుకకు అమర్చబడింది. దీని ద్వారా పిల్లల తలలకు పూర్తి రక్షణను అందిస్తాయి.

ఇక దీని ఇంపాక్ట్ విషయానికొస్తే.. చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్స్ (CRS) రెండూ పూర్తి సైడ్ ఇంపాక్ట్ సేఫ్టీను అందించాయి. మొత్తంగా పిల్లల రక్షణ పరంగా కరెన్ పనితీరు అద్భుతంగా ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది. కరెన్‌లో రియర్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ యాంకర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. భారతదేశంలో ఈ కారు 1.5L పెట్రోల్ (115bhp), 1.4L టర్బో పెట్రోల్ (140bhp), 1.5L డీజిల్ (115bhp) ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News