Big Stories

Ruturaj On Reason: ఓటమికి అదే కారణం,అంతేనా..

Ruturaj On Reason: ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో ఫేవరేట్ టీమ్ చెన్నై జట్టు. మిగతా టీమ్‌ల కంటే ఈ జట్టు బాగుందని చాలామంది విశ్లేషకులు భావించారు. అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. అయితే మంగళవారం రాత్రి చెపాక్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌ ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై పోస్టుమార్టం జరుగుతోంది. తమ జట్టు ఓటమి వెనుక కారణాలు వివరించాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.

- Advertisement -

మ్యాచ్‌‌లో సగానికి పైగా మాదే పైచేయి అయ్యిందని, కాకపోతే మంచు కారణంగా తాము ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు కెప్టెన్ రుతురాజ్. 14వ ఓవర్ వరకు తాము ఆధిక్యంలో ఉన్నామని, స్టాయినిస్ ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ తమకు దూరమైందన్నాడు. దీని వెనుక మరో కారణం మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో బౌలర్లు పట్టు కోల్పోయారని తెలిపాడు. తాము అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ చేశామని, కాకపోతే పరిస్థితులు తమకు కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు రుతురాజ్.

- Advertisement -

మ్యాచ్ విజయంపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. సొంత మైదానంలో చెన్నైని ఓడించడం మామూలు విషయం కాదన్నాడు. ఒకానొక దశలో తాము వెనుకబడ్డామని, కాకపోతే బ్యాటింగ్‌లో పైచేయి సాధించడంతో విజయం తేలికైందన్నారు. చెపాక్ పిచ్‌పై 180 పరుగులు చేస్తే మంచి స్కోరని అన్నాడు.
కానీ, చెన్నై జట్టు 200 పైచిలుకు పరుగులు చేసి తమపై ఒత్తిడి పెంచిందన్నాడు రాహుల్. అయితే స్టాయినిస్ తెలివిగా ఆడుతూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ రూల్ వల్ల బ్యాటింగ్ ఇంకాస్త బలంగా మారిందన్నాడు.

ALSO READ: సచిన్‌కు బర్త్ డే విషెస్, లవ్ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

చెపాక్‌లో ఓటమి కారణంగా పాయింట్ల పట్టికలో చెన్నై టీమ్ ఐదో స్థానానికి పరిమితమైంది. లక్నో ఓ మెట్టు పైకి ఎగబాకింది. ముఖ్యంగా హైదరాబాద్, కోల్‌కత్తా జట్ల నుంచి చెన్నైకి గట్టిపోటీ ఎదురవుతోంది. మరి 28న ఆదివారం చెన్నై-హైదరాబాద్ జట్ల చెపాక్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లుగా పోరు జరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News