E-Paper
Advertisement

Indian Army Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

Indian Army Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !
Advertisement

Indian Army Recruitment 2024 (govt job notification latest): ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ స్కీమ్ కింద 57వ కోర్స్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ విధానం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు వివరాలు: ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం 57వ కోర్సు-2025 ఏప్రిల్
ఎన్‌సీసీ పురుషులు: 70పోస్టులు, ఎన్‌సీసీ మహిళలు: 6 పోస్టులు
నోట్: యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఈ రెండు విభాగాల్లో ఎనిమిది పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటాయి.

Advertisement

విద్యార్హత:అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు డిగ్రీ చదివినా లేదా చదువుతున్నా.. మూడేళ్లు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో ఉండాలి.
ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్ కనీసం బీ- గ్రేడ్ సాధించి ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్ అవసరం లేదు.

వయో పరిమితి: అభ్యర్థులు 2024 జనవరి 1 నాటికి 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు నిర్వహిస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేసి అర్హులైన అభ్యర్థులను ఎంపికచేస్తారు.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నైలో 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు.

జీత భత్యాలు: ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా 56,100 స్టైపండ్ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ పట్టాను మద్రాస్ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది. ఆ తర్వాత వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరితేది: ఆగష్టు 9,2024

Also Read:  ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలివే !

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  • క్యాప్చా ఎంటర్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • వెంటనే ఆఫీసర్ సెలక్షన్ ఎలిజిబిలిటీ ఓపెన్ అవుతుంది.
  • తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్సు ఎదురుగా ఉన్న అప్లై లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ లో వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • తర్వాత అన్ని వివరాలను సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×