BigTV English

Best Selling Scooters in India: ఇండియాలో ఈ స్కూటీలకు ఊహించని డిమాండ్.. పరుగులు పెడుతున్న వాహన ప్రియులు!

Best Selling Scooters in India: ఇండియాలో ఈ స్కూటీలకు ఊహించని డిమాండ్.. పరుగులు పెడుతున్న వాహన ప్రియులు!

Best Selling Scooters in India: ప్రస్తుతం ఆటో మార్కెట్‌లో టూ వీలర్ కంపెనీల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ ఏడాదిలో మేలో భారతదేశంలో సేల్స్‌లో టీవీఎస్, హోండా, సుజుకి వంటి కంపెనీలు భారీ స్థాయిలో పరుగులు తీసాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా తమదైన శైలిలో దూసుకుపోయాయి. అయితే గత నెలలో ఏ కంపెనీల స్కూటర్లు ఎక్కువగా సేల్ అయ్యాయో ఇప్పుడు చూసేద్దాం.


హోండా యాక్టివా:

భారత మార్కెట్‌లో హోండా యాక్టివా తనదైన శైలిలో దూసుకుపోతోంది. కొన్నేళ్ల నుంచి ఆటో మార్కెట్‌లో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. గత నెలలో ఈ హూండా యాక్టివా 2,16,352 స్కూటర్లు సేల్ అయ్యాయి. అయితే ఇది ఈ ఏడాది ఏప్రిల్ కంటే 16.88 శాతం తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్‌లో ఈ హూండా యాక్టివా 2,60,300 స్కూటర్లు అమ్ముడయ్యాయి. దీనితో పోల్చుకుంటే మేలో మరింత సేల్స్ తగ్గాయనే చెప్పాలి. కాగా హూండా యాక్టివా రూ.76.234 ఎక్స్ షోరూమ్ ధర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి వివిధ వేరియంట్లలో లభిస్తుంది.


టీవీఎస్ జుపిటర్:

టీవీఎస్ జుపిటర్ భారతదేశంలో మోస్ట్ పాపులర్ స్కూటర్లలో ఒకటి. ఇది మోస్ట్ పాపులర్ స్కూటర్లలో రెండో స్థానంలో ఉంది. అయితే టీవీఎస్ కంపెనీ గత నెల మేలో 75,838 జుపిటర్ స్కూటర్లను సేల్ చేసింది. అయితే ఇది ఏప్రిల్‌లో 77,086 యూనిట్లను సేల్ చేసింది. దీనిబట్టి టీవీఎస్ జుపిటర్ మేలో 1.62 శాతం తక్కువ నమోదు చేసింది. దీని ధర రూ.73,340 నుంచి స్టార్ట్ అవుతుంది.

Also Read: కిక్కిచ్చే ఆఫర్.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్లు.. మరో నాలుగు రోజులు మాత్రమే..!

సుజుకి యాక్సెస్ 125:

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఈ ఏడాది మే నెలలో సేల్స్‌లో మూడో స్థానంలో ఉంది. కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 77,086 యూనిట్లు సేల్ చేసింది. అదే సమయంలో మే నెలలో కేవలం 64,813 యూనిట్లు మాత్రమే విక్రయించింది. దీనిబట్టి చూస్తే 4.60 శాతం సేల్స్ తగ్గాయనే చెప్పాలి. సుజుకి యాక్సెస్ 125 రూ.79,899 (ఎక్స్-షోరూమ్) ధర నుంచి ప్రారంభమవుతుంది.

TVS ఎన్‌టార్క్:

TVS Ntorq స్కూటర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ స్కూటర్ మే 2024లో 29,253 యూనిట్లు సేల్ అయ్యాయి. అయితే ఇది ఏప్రిల్ 2024 ‌లో 30,411 యూనిట్లు సేల్ జరిగాయి. దీని ప్రకారం చూస్తే.. ఏప్రిల్ కంటే మే నెలలో 3.81 శాతం తక్కువగా నమోదు అయ్యాయి. TVS Ntorq రూ. 84,636 (ఎక్స్-షోరూమ్) ధరల నుంచి స్టార్ట్ అవుతాయి.

Also Read: TVS New Jupiter: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

ఓలా S1 టాప్ (ఎలక్ట్రిక్ స్కూటర్): ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఓలా తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది. అందులో ఓలా S1 ముందు వరుసలో ఉంది. ఇది రూ. 69,999 (ఎక్స్-షోరూమ్) స్టార్టింగ్ ధరలతో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ మే2024లో 37,225 యూనిట్లు సేల్ అయ్యాయి. అయితే ఇది ఏప్రిల్‌ 2024లో మొత్తం 33,963 యూనిట్ల సేల్ జరగడంతో ఏప్రిల్ కంటే మేలో 9.60 శాతం ఎక్కువగా నమోదు చేసింది.

Tags

Related News

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

Scheme for women: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం

Big Stories

×