BigTV English

Foods to Avoid on Empty Stomach: వామ్మో.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా..? మీ ఆరోగ్యం చిక్కుల్లో పడ్డట్టే..!

Foods to Avoid on Empty Stomach: వామ్మో.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా..? మీ ఆరోగ్యం చిక్కుల్లో పడ్డట్టే..!
Advertisement

Foods That You Must Avoid Eating On An Empty Stomach: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం చాలా అవసరం.. అయితే ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాని కొందరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే బెడ్ టీ, కాఫీ, ఏదైనా జ్యూస్ లేదా డ్రింక్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఉదయాన్నే కాళీ కడుపుతో ఇలాంటి ఆహారం తినడం వలన ఆరోగ్యానికి హానికలుగుతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉంటాలంటే.. యోగా, మెడిటేషన్, వ్యాయామం ఎంత అవసరమో మనం తినే తిండి కూడా అంతే అవసరం. ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం..


చక్కెర
ఉదయం నిద్ర లేవగానే పాలు, పంచదార టీ, చాక్లెట్, బిస్కెట్లు తినడం చాలా తప్పు. చక్కెర మన శరీరం, రక్త ప్రవాహంలోకి వేగంగా ప్రవేశిస్తుంది. మీరు ఉదయాన్నే ఏదొక రూపంలో చక్కెరను తీసుకుంటే.. అది శరీరంలోకి డోపమైన్ విడుదల చేస్తుంది. దీని కారణంగా గ్లూకోజ్ సులభంగా ప్రేగులకు ఆ తరువాత రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సిట్రస్ పండ్లు, జ్యూస్ లు
నారింజ వంటి సిట్రస్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అసిడిటీ, అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి.


Also Read: Health Benefits of Nutmeg: జాజికాయను ఇలా తీసుకుంటే.. ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా..

టీ- కాఫీ
చాలా మంది ఉదయం నిద్రలేవగానే బెడ్ టీ, కాఫీని ఎప్పుడూ మిస్ అవరు. కాని వీటి వల్ల మన శరీరంలో కెఫిన్ ఎక్కువగా విడులవుతుంది. వీటివల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

బేకరీ పదార్ధాలు
బ్రెడ్, కుకీలు, ఈస్ట్‌తో చేసిన పేస్ట్రీలు, ఇతర స్వీట్లు వంటి ఇలాంటివి తినడం వల్ల పొట్టలో లైనింగ్ దెబ్బతింటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందువల్ల ఉదయాన్నే ఈ ఫుడ్ కి దూరంగా ఉండటమే బెటర్.

Also Read: మీ స్కిన్ టోన్‌కు ఏ లిప్‌స్టిక్ షేడ్ సెట్ అవుతుందో చూసేయండి !

అరటి పండ్లు
ఆరోగ్యానికి మంచిదే.. వీటిలో అనేర రకాల మినరల్స్, విటమిన్లు ఉంటాయి. కానీ ఉదయాన్నే కాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరగడంతో పాటు, గుండెకు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పెరుగు

పెరుగులో అనేక పోషకాలు ఉన్నప్పటికి ఉదయాన్నే మాత్రం తినకూడదు. కాళీ కడుపుతో తినడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Related News

Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Waking Up: మధ్య రాత్రి మెలకువ వస్తోందా? అసలు కారణాలివే !

Breakfasts: మార్నింగ్ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !

Health Risks: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Big Stories

×