Big Stories

CM Revanth Reddy Speech : కార్పొరేట్ పాఠశాలల్లో కాదు సర్కారు బడిలోనే చదివా..

 

- Advertisement -

CM Revanth Reddy Speech

- Advertisement -

CM Revanth Reddy Speech(Political news in telangana): తెలంగాణలో కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో అధ్యాపక, ఉపాధ్యాయక ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియాపక పత్రాలు అందించారు. ఇదే ఎల్బీ స్టేడియంలో 3 నెలల క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్నదాతను రాజుగా మార్చే పరిపాలనకు ఇక్కడే నాంది పలికామన్నారు. ఈ 3 నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు.

తనకు ఇంగ్లీష్ రాదని కొందరు హేళన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సర్కార్ బడిలోనే చదివానన్నారు. గుంటూరు, గుడివాడ వెళ్లి కార్పొరేట్‌ పాఠశాలలు, కాలేజీల్లో చదవలేదన్నారు.
జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే చదివినా.. సీఎం స్థాయికి ఎదిగానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి బలిదానాలు, పోరాటంతోనే రాష్ట్ర ఏర్పాటు కల నెరవేరిందని స్పష్టంచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు న్యాయ జరుగుతుందని యువత ఎదురుచూశారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనతో యువత ఆశలు తీరలేదన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. కేసీఆర్ తోపాటు వాళ్ల ఫ్యామిలీలోని నాయకుల పదవులు ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భావించారన్నారు. కేసీఆర్ ను గద్దె దించడం వల్లే ఇప్పుడు తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.

Read More : మెట్రో రెండో దశ.. ఈ నెల 8న శంకుస్థాపన..

గురుకులాలు నిర్మించామని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ గురుకులాలకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించలేదని మండిపడ్డారు. అద్దె భవనాల్లోనే నడిపిస్తున్నారని విమర్శించారు. రేషనైలేజేషన్‌ పేరుతో 6 వేల పాఠశాలలను ముసివేశారని మండిపడ్డారు.పేదలు కులవృత్తులే చేసుకోవాలన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. గొర్రెలు, బర్రెలు, చేపలు పెంపకంతో జీవించాలని భావించిందన్నారు. కేసీఆర్ మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌ పై కేసు పెట్టారని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News