BigTV English

Huge Discounts on Honda Cars: ఈ హోండా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.15 లక్షల వరకు పొందొచ్చు..

Huge Discounts on Honda Cars: ఈ హోండా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.15 లక్షల వరకు పొందొచ్చు..

Huge Discounts on Honda Cars in this Month: భారతీయ మార్కెట్‌లో కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమ కార్లను అత్యధికంగా సేల్ చేసేందుకు రకరకాల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ కార్ మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పుడు మరొక కంపెనీ తమ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తుంది.


ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా ఇండియా ఈ నెలలో (మే నెలలో) కొన్ని కార్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. అమేజ్, సిటీ, సిటీ హైబ్రిడ్, హోండా ఎలివేట్ వంటి కార్ మోడళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తుంది. అందువల్ల ఈ నెలలో కారును కొనుక్కునే ప్లాన్‌లో ఉన్నవారు భారీ తగ్గింపులతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై నెల వరకు అందుబాటులో ఉండకపోవచ్చు.

హోండా సిటీ:


హోండా కంపెనీకి చెందిన ‘సిటీ’ మోడల్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. గతేడాది లాంచ్ అయిన హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ మీద కస్టమర్లు రూ.1.15 లక్షల ప్రయోజనాలను పొందుతారు. అలాగే టాప్ స్పెక్ హోండా సిటీ జెడ్‌ఎక్స్‌పై రూ.88000 బెనిఫిట్స్ పొందుతారు. అలాగే దీని బేస్ వేరియంట్‌పై రూ.78,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. హోండా వీ, వీఎక్స్ కొనుగోలుపై రూ.58,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో 1.5 లీటర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

Also Read: ఈ ఏడాది లాంచ్ కానున్న క్యూటెస్ట్ కార్లు ఇవే..!

హోండా అమేజ్:

హోండా అమేజ్ కూడా మార్కెట్‌లో మంచి ఆదరణను పొందింది. గతేడాది 2023లో లాంచ్ అయిన హోండా అమేజ్ ఎలైట్ కారు కొనుగోలుపై కస్టమర్లు ఏకంగా రూ.96,000 వరకు ప్రయోజనాలను పొందుతారు. దీని బేస్ స్పెక్ హోండా అమేజ్ వేరియంట్‌పై రూ.56,000 లభిస్తుంది. ఎస్, వీఎక్స్ వేరియంట్లపై రూ.66,000 వరకు ప్రయోజనాలు పొందుతారు. ఇది 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

హోండా సిటీ హైబ్రిడ్ :

హోండా సిటీ హైబ్రిడ్ మోడల్‌పై కూడా కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా రూ.65,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే ఈ ప్రయోజనాలు వీ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Also Read: Zhidou Rainbow Mini Ev: రూ.3. 6 లక్షలకే బుల్లి ఎలక్ట్రిక్ కారు!.. ఎక్కడో తెలుసా?

హోండా ఎలివేట్:

హోండా సిటీ, హోండా హైబ్రిడ్, హూండా అమేజ్‌పైనే కాకుండా హూండా ఎలివేట్‌పై కూడా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.55,000 వరకు ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ బెనిఫిట్స్ వీ వేరియంట్‌పై మాత్రమే లభిస్తాయి. అలాగే టాప్ స్పెక్ జెడ్‌ఎక్స్‌పై రూ.25,000 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతోపాటు ఇతర వేరియంట్లపై రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఈ ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ కేవలం ఈ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు దగ్గర్లోని డీలర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×