Bigg Boss ott 3 latest news(Today’s entertainment news): హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3 లో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బిగ్ బాస్ కార్యక్రమంలో అందరి ఫేవరేట్ లవ్ కేశ్ కటారియా ఎలిమినేషన్ పట్ల అభిమానులు మండిపడుతున్నారు. కటారియాని తీసేయడం అన్యాయమని చెబుతూ.. బాయ్ కాట్ బిగ్ బాస్ అని హ్యాష్ టాగ్ పెడుతున్నారు. చాలామంది జియో సినిమా యాప్ అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఓటీటీ 3 లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో నలుగురిని నామినేట్ చేశారు. సనా మక్బూల్, లవ్ కేశ్ కటారియా, సాయి కేతన్, అర్మాన్ మలిక్ వీరంతా డేంజర్ జోన్ లో ఉండగా.. మిగతా ముగ్గురు కృతికా మలిక్, రణ్ వీర్ షోరె, నేజీ ఫైనల్ చేరుకున్నారు. కానీ జూలై 30న బిగ్ బాస్ మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందరూ సాయి కేతన్, అర్మాన్ మలిక్ ఇద్దరూ ఇక ఇంటికెళ్లారు అని అనుకుంటుండగా.. దానికి విపరీతంగా లవ్ కేశ్ కటారియా, అర్మాన్ మలిక్ పేర్లు ఎలిమినేషన్ లిస్టులో వచ్చాయి. దీంతో సాయి కేతన్ సేఫ్ అయ్యాడు.
లవ్ కేశ్ కటారియాకు ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సీజన్ ప్రారంభంలో అతను వచ్చినప్పుడు అతనెవరో కూడా ఎవరికీ సరిగా తెలియదు. ఫేమస్ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ మేనేజర్ గా మాత్రమే కొంచెం గుర్తింపు ఉండేది. కానీ క్రమంగా బిగ్ బాస్ కార్యక్రమంలో తనకంటూ లవ్ కేశ్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందరూ ఇక లవ్ కేశ్ ఫైనల్ వెళ్లడం ఖాయమని అనుకుంటుండగా.. కేవలం ఫైనల్ మూడు రోజులు ముందు సడెన్ గా అతన్ని బిగ్ బాస్ మేకర్స్ ఎలిమినేట్ చేసేశారు. పైగా అర్మాన్ మలిక్ ని కూడా బయటికి పంపించేశారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ అభిమానులు ఎంత అన్యాయం అని పోస్టులు చేస్తున్నారు. బిగ్ బాస్ మేకర్స్ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు. ఫలితంగా ఇప్పుడు ‘బాయ్ కాట్ బిగ్ బాస్’ అని బాగా ట్రెండ్ అవుతోంది. చాలామంది జియో సినిమా యాప్ అన్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
Also Read: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్
లవ్ కేశ్ కటారియా ఎలిమినేషన్ పై మండిపడుతూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఒక నెటిజెన్ తాను జియ్ సినిమా యాప్ డెలీట్ చేశానని రాస్తూ.. ”కటారియా బ్రదర్ ని గెలవకూడదని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు అలాంటప్పుడు ఈ షోలో అతన్ని పాల్గొనేందుకు ఎందుకు పిలవాలి. కటారియా అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ నాశనమైపోతే బాగుంటుంది” అని చెప్పాడు.
మరో యూజర్ అయితే.. ‘ఇదంతా ఫిక్సింగ్ జరిగింది. 20 ఏళ్లుగా బిగ్ బాస్ సంపాదించిన పరువంతా పోయింది. ఎల్విష్ ఆర్మీ కటారియాకు మద్దతుగా నిలుస్తుంది,’ అని ట్వీట్ చేశాడు.
ఇంకొకరైతే.. ‘అందరూ ఇష్టపడే కటారియాని బయటికి పంపించేశారు. ప్లీజ్ అందరూ బిగ్ బాస్ చూడడం మానేయండి. బాయ్ కాట్ బిగ్ బాస్,’ అని రాశాడు
బిగ్ బాస్ ఓటీటీ 3 విన్నర్ ఎవరంటే?
బిగ్ బాస్ ఓటీటీ 3 ఫినాలె ఆగస్టు 2 జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఫైనల్ లో మొత్తం అయిదుగురు ఉంటారు. ఈ అయిదు మందిలో రణ్ వీర్ షోరె, సనా మక్బూల్ మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరిద్దరిలోనే విన్నర్ అయ్యేందుకు అవకాశాలున్నాయి. అయితే చివరి వరకు ఏదీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
Also Read: పెళ్లికి నిరాకరించిన 40 ఏళ్ల ప్రియురాలు.. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తామని..