Big Stories

Kia India Upcoming Cars : కియా లవర్స్‌కు పండగే.. త్వరలో మూడు కొత్త EVలు లాంచ్!

Kia India Upcoming Cars : దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈవీలను వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వాలు సైతం ఈవీ కంపెనీలకు ప్రోత్సహాలు అందిస్తున్నాయి. ఈవీ మార్కెట్ వేేగంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మీరు కూడా ఈవీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంటే కియా ఇండియా శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ కార్లకు నానాటికీ డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్‌లో మూడు కొత్త EVలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 2025 నాటికి రెండు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం రండి.

- Advertisement -

Kia EV9 గత సంవత్సరం ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయబడింది. భారతదేశంలో దీని ప్రారంభం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో జరుగుతుందని భావిస్తున్నారు. IC-ఇంజిన్‌తో కూడిన కియా క్లావిస్ విదేశాలతో పాటు భారతదేశంలో ఇప్పటికే వివిధ ప్రదేశాలలో టెస్టింగ్ నిర్వహించారు. దక్షిణ కొరియా ఆటో మేకర్ 2025 నాటికి Carens ఆధారంగా ఎలక్ట్రిక్ MPVని విడుదల చేయాలని చూస్తోంది.

- Advertisement -

Also Read : టయోటా నుంచి మూడు కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఉంటది బాసు.. లాంచ్ ఎప్పుడంటే..?

Kia Carens EV
దక్షిణ కొరియా ఆటో మేకర్ 2025 నాటికి Carens ఆధారంగా ఎలక్ట్రిక్ MPVని పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ రాబోయే e-MPV క్లావిస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో అనేక కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తీసుకురానుంది. అంతేకాకుండా భారతీయ బ్యాటరీ తయారీదారు ఎక్సైడ్‌తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ MPVని అభివృద్ధి చేయడంలో ఎక్సైడ్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Kia EV9
Kia EV9 గత సంవత్సరం ప్రపంచ మార్కెట్‌‌కు కంపెనీ లాంచ్ చేసింది. భారతదేశంలో దీనిని 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో తీసుకురావాలని కియా ఇండియా భావిస్తోంది. ఇది పూర్తిగా భారత మార్కెట్‌లో దిగుమతి అవుతుంది. EV9 WLTP సైకిల్‌లో 541 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో సింగిల్, డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.

Also Read : రూ. 1.69 కోట్లతో పోర్షే సూపర్ కార్ లాంచ్.. ఇక రోడ్లపై యుద్ధమే..!

Kia Clavis EV
IC-ఇంజిన్‌తో కూడిన కియా క్లావిస్ విదేశాలతో పాటు భారతదేశంతో సహా వివిధ ప్రదేశాలలో ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. 2025 ప్రారంభంలో దేశంతో సహా పలు మార్కెట్‌లలో లాంచ్ చేయడానికి ప్లాన్‌తో ఉన్నట్లు కియా వెల్లడించింది.  క్లావిస్  ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా టెస్టింగ్‌లో ఉంది. టాటా పంచ్ EVకి పోటీగా 400 కి.మీల పరిధితో వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News