Big Stories

Hybrid vs CNG vs Diesel : డీజిల్, సీఎన్‌జీ, పెట్రోల్ హైబ్రిడ్ కార్లలో ఏది బెస్టో తెలుసా..?

Hybrid vs CNG vs Diesel : ఆటోమొబైల్ రంగం కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు ఉత్తమమైన కార్లను అందిస్తోంది. గత కొన్ని సంవత్సరాలలో, ఆటోమొబైల్ రంగం డీజిల్ నుండి పెట్రోల్‌కు తరువాత CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు మారింది. ఇది నేరుగా కారు వినియోగదారులకు, పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌ను ఎలక్ట్రిక్ వాహనాలే శాసిస్తున్నాయి.

- Advertisement -

వీటన్నింటి మధ్య, హైబ్రిడ్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వాహనాలు తమ స్థానాన్ని సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్, హైబ్రిడ్ పెట్రోల్, CNG వాహనాల్లో ఏది మంచిదని తరచుగా వాహన ప్రియులకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మూడు ఇంధనాలతో నడిచే వాహనాలలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

Also Read : మైండ్ బ్లోయింగ్ కలర్‌తో మహీంద్రా బ్లేజ్ ఎడిషన్‌.. ధర ఎంతంటే..?

Diesel
డీజిల్ కార్లు అభివృద్ధి చేయబడిన మొదటి వాహనాలు.  అప్పటి నుండి అవి దూర ప్రయాణాలు చేసే వ్యక్తులకు మొదటి ఎంపికగా ఉన్నాయి. వాస్తవానికి ఇతర ఇంధనంతో నడిచే వాహనాల కంటే డీజిల్ వాహనాలు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. అంతేకాకుండా డీజిల్ వాహనాలు కూడా ఎక్కువ శక్తిని పొందుతాయి. అటువంటి పరిస్థితిలో పెట్రోల్, CNG వాహనాల కంటే డీజిల్ వాహనాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా XUV700 మార్కెట్లో డీజిల్ వాహనాల్లో ఉత్తమ ఎంపికలు.

CNG
CNG ఆధారిత వాహనాలు కూడా ఒక విధంగా హైబ్రిడ్. అవసరమైతే వాటిని పెట్రోల్‌తో కూడా నడపవచ్చు. పర్యావరణ పరంగా పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే CNG వాహనాలు మెరుగైనవి. అయితే CNG వాహనాలు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే CNG వాహనాలు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా టియాగో, హ్యుందాయ్ ఆరా ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ CNG వాహనాలుగా ఉన్నాయి.

Also Read : ఈ ఏడాది లాంచ్ కానున్న క్యూటెస్ట్ కార్లు ఇవే.. ఫీచర్స్, లుక్స్ అదుర్స్

Petrol Hybrid
పెట్రోల్ హైబ్రిడ్ కార్లలో బ్యాటరీకి అనుసంధానించబడిన ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా అందిస్తారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే పెట్రోల్ హైబ్రిడ్ కారు ఎక్కువ మైలేజీని ఇస్తుంది. అలానే పెట్రోల్ హైబ్రిడ్ వాహనాలను టెక్నాలజీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తారు. చివరగా మూడు ట్రిమ్‌ల వాహనాలను ఇంధన సామర్థ్యం పరంగా వర్గీకరించినట్లయితే, పెట్రోల్ హైబ్రిడ్ వాహనం మొదటి స్థానంలో ఉంటుంది. CNG వాహనాలు రెండవ స్థానంలో ఉన్నాయి. ఇవి తక్కువ శక్తిని ఇస్తాయి. కానీ ఎక్కువ మైలేజీని క్లెయిమ్ చేస్తాయి. చివరి స్థానంలో డీజిల్ పవర్ ట్రూన్‌ వాహనం వస్తుంది. ఇది మూడో స్థానంలో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News