BigTV English

Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు

Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు

Election Commission Orders: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే డీజీపీని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని అందులో పేర్కొంది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ను ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వారికి సంబంధించినటువంటి ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపాలని సూచించింది.


ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు(1989 బ్యాచ్), మాదిరెడ్డి ప్రతాప్(1991 బ్యాచ్), హరీష్ కుమార్ గుప్తా(1992 బ్యాచ్) పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని నూతన డీజీపీగా ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం.

కాగా, ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఈసీకి వారు ఫిర్యాదు చేయగా, వాటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పలువురు ఉన్నతాధికారులపై కూడా ఈసీ బదలీ వేటు వేసిన విషయం తెలిసిందే.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×