BigTV English

India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?

India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?

India’s Q3 GDP : మూడో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వృద్ధి 6.2 శాతంగా నమోదైంది. గతేడాది త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉండగా, ఈ ఏడాది 6.2%కి పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా కురిసిన వర్షపాతం, కాలానికి అందుబాటులోకి వచ్చిన రుతుపవనాలు సహా అధిక ప్రభుత్వ వ్యయం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చిందని వెల్లడించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ సుంకాల బాదుడు హెచ్చరికలు ఆందోళనలను కలిస్తుంది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని దెబ్బతీసే అవకాశాలున్నాయనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పటికీ.. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.6% కంటే తక్కువగా ఉంది.


ఈ ఆర్థిక ఏడాది వృద్ధి అంచనాను ప్రభుత్వం పెంచింది. కానీ, నాలుగేళ్ల కనిష్ట స్థాయికి వృద్ధి పడిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. సవరించిన అంచనాల మేరకు ఈ ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక ఏడాది FY24లో నమోదైన సవరించిన వృద్ధి రేటు 9.2%. ఏడాదిలోనే ప్రభావిత స్థాయిలోనే మందగమనాన్ని ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. మొదటి ముందస్తు అంచనా ముందుగా FY25 వృద్ధిని 6.4%గా అంచనా వేశారు.

గతేడాదితో పోల్చితే ఈసారి గ్రామీణ ప్రజల నుంచి మంచి కొనుగోళ్లు జరిగినట్లుగా ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నారు. దేశీయ వినియోగదారుల వ్యయం గత త్రైమాసికంలో 5.9% కాగా.. ఈ ఏడాది 6.9%నికి పెరిగింది. అందుకు అందుబాటులోని ఆహార ధరలు, పండగ సీజన్లల్లో పెరిగిన కోనుగోళ్ల వల్ల సాధ్యమైందని చెబుతున్నారు. వ్యవసాయ వృద్ధి సైతం గతేడాది నమోదైన 1.5% నుంచి 5.6%కి పెరిగింది. ఇదే తరుణంలో.. దేశీయ తయారీ రంగంలో వృద్ధి రేటు మందగమనాన్ని చవిచూసింది. గత ఆర్థిక ఏడాదిలో 14% నుంచి దారుణంగా పడిపోయి కేవలం 3.5% నికే పరిమితమైనట్లు గుర్తించారు. నిర్మాణ రంగం గత సంవత్సరం 10% వృద్ధితో పోలిస్తే 7% వద్ద ఆగిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నారు. పారిశ్రామిక వృద్ధి సైతం గతేడాది 11.8% నుంచి 4.5% నికి పడిపోయింది.


ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ.. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అవసరమైన 8% వృద్ధి రేటును అందుకోవడంలో వెనుకబడి ఉందని అంటున్నారు. అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ విధిస్తానంటున్న ప్రతీకార సుంకాలతో ప్రపంచ వాణిజ్యాం, భారత్ వాణిజ్యంపై కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో 2024-25 ఏడాదికి భారత వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.4 శాతం వృద్ధిని ప్రభుత్వం అంచనా వేస్తోంది

పెరిగిన ప్రభుత్వ వ్యయం

ఎన్నికల సమయంలో మందగమనం తర్వాత.. 2024 చివరి మూడు నెలల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చును పెంచింది. ఈ త్రైమాసికంలో రోడ్లు, ఓడరేవులు, రహదారులపై ప్రభుత్వం రూ.2.7 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో బడ్జెట్‌లో కేటాయించిన మూలధన వ్యయంలో 61.7% ఉపయోగించింది, సెప్టెంబర్ వరకు ఇది 37.7%గా ఉంది. దీపావళి పండుగ సీజన్‌లో గ్రామీణ వినియోగం కూడా మెరుగుపడే అవకాశం ఉంది, రైతులు మిగులు వర్షాలు, మంచి పంటల దిగుబడితో వృద్ధి రేటులో మంచి స్థానాన్ని సంపాదించినట్లు తెలుపుతున్నారు.

Also Read : Today Movies in TV : ఈరోజు టీవీ ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

ఆర్థికవేత్తలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. సగటు GDP వృద్ధి అంచనా 6.6% కాగా.. అంచనాలు 5.9% నుంచి 7% మధ్య ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్తేజపరిచేందుకు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి యూనియన్ బడ్జెట్ లో రికార్డు స్థాయిలో రూ.1 లక్ష కోట్ల పన్నులను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయ పరిమితులను తగ్గించుకున్నారు.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×