BigTV English

June Month Best Selling Car: ఏంది మామ ఈ క్రేజ్.. ఈ కారును ఏంటి ఇలా కొంటున్నారు.. అసలు కథ ఇదేనేమో..!

June Month Best Selling Car: ఏంది మామ ఈ క్రేజ్.. ఈ కారును ఏంటి ఇలా కొంటున్నారు.. అసలు కథ ఇదేనేమో..!

June Month Best Selling Car in India: దేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ క్రేజీగా పెరుగుతోంది. ఇందులో భాగంగా మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. దాని స్టైలిష్ డిజైన్, ఇంజన్, అధిక మైలేజ్ కారణంగా దీన్ని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు అమ్మకాల గురించి మాట్లాడితే గత నెలలో 16,422 యూనిట్ల స్విఫ్ట్ సేల్ అయ్యాయి. అయితే గత సంవత్సరం కంపెనీ పాత స్విఫ్ట్ 15,955 యూనిట్లను విక్రయించింది.


జూన్ నెలలో కొత్త స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. మారుతి సుజుకి WagonR రెండవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ కారు 14,895 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కాకుండా జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా బాలెనో నిలిచింది. గత నెలలో కంపెనీ 13,790 యూనిట్లను విక్రయించింది. అయితే కొత్త స్విఫ్ట్ ఎక్కువగా ఎందుకు సేల్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్ ఫోరూమ్ ధర రూ.6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది LXi, VXi, VXi (O), ZXi, ZXi+, ZXi+ డ్యూయల్ టోన్‌తో సహా 6 వేరియంట్‌లలో లభిస్తుంది. కొత్త స్విఫ్ట్‌లో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. కారు సీట్లు స్పోర్టీగా ఉన్నాయి. ఇది కాకుండా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కారు వెనుక ఏసీ వెంట్ సౌకర్యం ఉంది.


Also Read: Upcoming Electric SUVs: ఇక ఆరు నెలలే.. అదిరిపోయే కార్లు వస్తున్నాయి.. ఫీచర్లు మాములుగా లేవు!

భద్రత కోసం ఈ కారు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా కారులో 3 పాయింట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, EBDతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందించారు. ఈ నెక్స్ట్ జనరేషన్ స్విఫ్ట్ యువతను లక్ష్యంగా చేసుకునే సరికొత్త బ్లాక్ ఇంటీరియర్ కలిగి ఉంది.

స్విఫ్ట్ ఎక్కువ మైలేజీ చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ కారు Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 82hp పవర్, 112 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో AMTలో కూడా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌పై 24.8kmpl, AMTలో 25.75 kmpl మైలేజీని గెయిన్ చేస్తుంది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు (జూన్ 2024)

  •  మారుతి స్విఫ్ట్ 16,422
  • మారుతి బాలెనో 14,895
  • మారుతి వ్యాగన్ఆర్ రూ 13,790
  • మారుతి ఆల్టో 7,775
  • హ్యుందాయ్ i20 5,315

Also Read: Best Bikes Under 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ సూపర్..!

  • టాటా టియాగో/EV 5,174
  • హ్యుందాయ్ ఐ10 నియోస్ 4,948
  • టయోటా గ్లాంజా 4,118
  • టాటా ఆల్ట్రోజ్ 3,937
  • మారుతి సెలెరియో 2,985

మారుతి వ్యాగన్ఆర్, బాలెనో ఫీచర్లు
వ్యాగన్-ఆర్, బాలెనో కూడా బాగా అమ్ముడవుతున్నాయి. వ్యాగన్ఆర్ గురించి మాట్లాడితే ఈ కారు ఫ్యామిలీకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇందులో స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాగన్-R లో 1.0L, 1.2L పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది. అలానే వ్యాగన్ ఆర్ సీఉఎన్‌జీలో కూడా లభిస్తుంది.ఈ కారు కిలోకి 34.04 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ అనే రెండు ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు పనితీరు పరంగా అద్భుతంగా ఉంటాయి. WagonR 7-అంగుళాల SmartPlay Studio టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4-స్పీకర్‌లతో నావిగేషన్, ప్రీమియం సౌండ్‌తో వస్తుంది.

Also Read: Hatchback Sales: ఈ కార్లకు భారీగా తగ్గిన డిమాండ్.. కుప్పకూలిన సేల్స్!

మారుతి సుజుకి బాలెనో దాని స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. మారుతి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.66 లక్షల నుండి ప్రారంభమవుతుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారులో 1197 సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 88.5 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ కారులో 318 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది. ఈ కారులో హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. బాలెనోలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×