BigTV English
Advertisement

Telangana:పేరు మార్పుపై పెరుగుతున్న ఒత్తిడి..ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్?

Telangana:పేరు మార్పుపై పెరుగుతున్న ఒత్తిడి..ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్?

BRS Party latest news(Political news in Telangana): కొన్ని సెంటిమెంట్లు బలంగా పాతుకుని పోతాయి. ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రను వేస్తాయి. సాధారణంగా ఒక ఇంటిని మారి మరో ఇంటికి వెళ్లగానే మనసులో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. ఖాళీ చేసి వచ్చిన చుట్టుపక్కల ఉన్నవారితో సాంగత్యం, ఆ ఇంటిపై పెంచుకున్న మమకారం, అనుబంధాలు, ఆప్యాయతలు కొత్తగా చేరిన ఇంటి చుట్టుపక్కల వాతావరణంతో కలవడానికి కొంత సమయం పడుతుంది. దశాబ్దం క్రితం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పార్టీగా టీఆర్ఎస్ కు మంచి పేరు ఉంది. ఆ పేరు బలంతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అదే సెంటిమెంట్ తో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై మోజు పెరిగింది. మరి ఏ జ్యోతిష్కుడు చెప్పాడో..ఎవరు సూచించారో తెలియదు గానీ పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చేశారు. కనీసం తన సన్నిహితులైన మంత్రులు, అధికారులకు కూడా చెప్పకుండా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చే నిర్ణయం తీసుకున్నారు.


అస్తిత్వం కోల్పోయిన పార్టీ

ఎప్పుడైతే పార్టీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పటినుంచి కేసీఆర్ కు కష్టాలు దాపురించాయి. గతేడాది కవిత అరెస్టుతో మొదలైన కష్టాలు..తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికలలో సున్నా ఫలితాలు, మరో పక్క వెంటాడుతున్న కేసులు, పార్టీ నుంచి వలసలు..ఈ పరిణామాల మధ్య పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. దీనితో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ ప్రముఖుల నుంచి అధినేత కేసీఆర్ ను పార్టీ పేరు మార్చాల్సిందిగా డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ పేరులో తెలంగాణ అస్తిత్వం ఉందని..అదే బీఆర్ఎస్ అనగానే అస్తిత్వాన్ని కోల్పాయామని కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రతిపాదన కేసీఆర్ ముందుకు రాగా పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఈ విషయంలో పునరాలోచించాలని పార్టీ నీనియర్లు ఎన్నిసార్లు కేసీఆర్ కు తమ విన్నపాలు వినిపించినా గులాబీ బాస్ కేర్ చేయలేదు. పైగా పార్టీ మార్చడం అవమానకరంగా భావిస్తూ వచ్చారు.


హరీష్ రావు సంకేతమిచ్చారా?

జాతీయ రాజకీయాలను పట్టుకువేళ్లాడితే ఇక్కడ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు కూడా బీఆర్ఎస్ పేరు మార్పు ఇష్టం లేనప్పటికీ మామ నిర్ణయం కాదనలేక ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ సమావేశంలో పాత టీఆర్ఎస్ కండువాతో దర్శనమిచ్చారు. అయితే ఇది యాధృచ్ఛికమా లేక కావాలనే తన వ్యతిరేకత తెలపడానికా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రీసెంట్ గా బండి సంజయ్ హరీష్ రావు బీజేపీలోకి రావాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. దీనితో హరీష్ రావు పార్టీ మారతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు హఠాత్తుగా టీఆర్ఎస్ కండువా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పేరు మార్పునకే మొగ్గు

ఇవన్నీ పక్కన పెడితే మొదటినుంచి సెంటిమెంట్ కే విలువనిచ్చే కేసీఆర్ మదిలో కూడా జరుగుతున్న పరిణామాలపై మనసులో ఆందోళన మొదలయింది. తాము తప్పు ఎక్కడ చేశామనే అంతర్మధనానికి లోనవుతున్నారు. అంతగా ప్రజావ్యతిరేకత ఎందుకు పెరిగిపోయిందో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. అందుకే రాబోయే శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం పేరు మార్పుతోనైనా పార్టీకి కలిసి వస్తుందేమో..తిరిగి పూర్వ వైభవం రావచ్చేమో అని భావిస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×