BigTV English

Maruti Suzuki WagonR: చెబితే నమ్మరు బ్రో.. రూ.1.5 లక్షలకే మారుతీ వ్యాగన్ ఆర్.. కిర్రాక్ డీల్ మామ!

Maruti Suzuki WagonR: చెబితే నమ్మరు బ్రో.. రూ.1.5 లక్షలకే మారుతీ వ్యాగన్ ఆర్.. కిర్రాక్ డీల్ మామ!

Get Maruti Suzuki Wagon R at Rs 1.5 Lakhs: దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు తమ అవసరాలకు అనుగుణంగా బ్రాండెడ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కార్ల కంపెనీలు కూడా ఇటువంటి వారికోసం ప్రత్యేకమైన కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ఈ బడ్జెట్ కార్లను సైతం కొనుగోలు చేయలేకపోతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మంచి సెకండ్ హ్యాండ్ కార్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ధరకే ఈ కారును దక్కించుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


మారుతి సుజుకి చెందిన రకరకాల కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో హ్యాచ్‌బ్యాక్‌ల నుండి SUVల వరకు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా మార్కెట్లో ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్నాయి. వీటిలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఇది తక్కువ ధర, మంచి మైలేజ్ కారణంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ గత కొన్నేళ్లుగా తమ కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది.

Also Read: మీ ప్రయాణాలకు ఇదే సేఫ్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్ EV!


మారుతి వ్యాగన్ఆర్ ధర గురించి మాట్లాడితే దీని ప్రారంభ ధర రూ. 4.54 లక్షలు. మీరు టాప్ మోడల్‌కి వెళితే రూ. 7.38 లక్షలకు చేరుకుంటుంది. మీరు ఈ కారును బడ్జెట్ లేకపోవడం వల్ల కొనుగోలు చేయలేకపోతే ఈ ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ సెకండ్ హ్యాండ్ మోడళ్లపై అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే ఫోన్ దక్కించుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ మారుతి వ్యాగన్ఆర్‌లో లభించే మొదటి ఆఫర్ OLX వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక్కడ వాగన్ఆర్ 2012 మోడల్ సేల్‌కి తీసుకొచ్చారు. దీని రిజిస్ట్రేషన్ గురించి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. CNG కిట్ కూడా ఈ కారులో ఇన్‌స్టాల్ చేశారు. కారు ధరను రూ.1.5 లక్షలుగా ఉంచారు. ఇంతకు మించి మరే ఇతర ఆఫర్ ఇవ్వడం లేదు.

మారుతి వ్యాగన్ఆర్‌పై రెండవ డీల్ QUIKR వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు 2013 మోడల్ . దీని రిజిస్ట్రేషన్ డేటా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కారు ధర రూ.2.3 లక్షలుగా నిర్ణయించారు. దానితో పాటు ఫైనాన్స్ ప్లాన్ కూడా ఉంటుంది.

Also Read: టాటా మోటర్స్ నుంచి ప్రీమియం EV.. బండి నెక్స్ట్ లెవల్ అంతే!

మారుతి వ్యాగన్ఆర్ సెకండ్ హ్యాండ్ మోడల్‌పై మూడవ డీల్‌ను Maruti Suzuki True Value నుండి పొందవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో 2014 మోడల్ మారుతి వ్యాగన్ఆర్ అమ్మకానికి ఉంచారు. ఈ కారు ధరను రూ.3 లక్షలుగా ఉంది. అంతే కాకుండా 6 నెలల ఇంజన్ వారంటీ, ఈజీ ఫైనాన్స్ ప్లాన్ కూడా అందిస్తున్నారు.

Note: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సెకండ్ హ్యాండ్ మోడల్స్‌పై లభించే ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్‌ నుంచి తీసుకోబడ్డాయి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×