E-Paper
Advertisement

Italy parliament MPs Fighting: ఇటలీలో జీ7 సమావేశాలు, పార్లమెంటులో ఎంపీల ఫైటింగ్

Italy parliament MPs Fighting: ఇటలీలో జీ7 సమావేశాలు, పార్లమెంటులో ఎంపీల ఫైటింగ్
Advertisement

Italy parliament MPs Fighting: ఇటలీ పరువు పోయిందా? ఒకవైపు జీ 7 సమావేశాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆదేశంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇందుకు ఇటలీ పార్లమెంటు వేదికైంది. జీ7 సమాావేశానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఇంకోవైపు అక్కడ పార్లమెంటులో ఎంపీలు ఫైటింగ్‌‌కు దిగడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంటులో ఎంపీలు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి.

జూన్ 12న ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆర్థికంగా మరింత స్వేచ్ఛ ఇచ్చేలా ఉద్దేశించిన బిల్లును అధికార పార్టీ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బిల్లు సమయంలో చర్చ జరుగుతోంది. దాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సెంటర్ లైఫ్ట్ ఫైర్ స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి సంబంధించిన ఓ ఎంపీ, జాతీయ జెండాను పార్లమెంటులో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

Advertisement

ఈ క్రమంలో అధికార-విపక్షాల మద్య ముష్టిఘాతాలు, తోపులాట, స్వలంగా కొట్టుకునే పరిస్థితికి చేరుకుంది. దాదాపు ఐదు పది నిమిషాల సేపు ఈ తతంగం జరిగింది. చివరకు సభ్యులు శాంతించారు. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర- దక్షిణ ప్రాంతాలు విభజన మరింత తీవ్రమవుతుందనేది విపక్షాల వాదన. దక్షిణాది ప్రాంతం మరింత ఇబ్బందిపడడమేకాదు, పేదరికం మరింత తీవ్రమవుతుందని అంటున్నారు. ఈ కారణంగానే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ:  అమెరికా భయం నిజమైంది, గ్రహాంతరవాసులు మన మధ్యే..

Advertisement

ఎట్టకేలకు పార్లమెంట్‌లో ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. ఎంపీలు హందాతనాన్ని మరిచి పరస్పరం దాడులకు దిగడం మంచిది కాదని అంటున్నారు. ఇలా చేయడం దేశం పరువు పోతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ లోపల జరిగిన ఘటనపై ఆదేశ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇటలీ పార్లమెంటులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. ఒకప్పుడు ఆసియాలో ఆ తరహా దృశ్యాలు చూశామని, ఇప్పుడు యూరప్‌ వంతైందని అంటున్నారు.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×