India’s Fastest Metro Service: ఫొటోలో ఉన్న రైలు కోచ్‌లు చూస్తుంటే వావ్ అనాలనిపిస్తోంది కదూ. అవి ఏదో విదేశీ రైళ్ల కోచ్‌లు అని అనుకుంటే పొరపాటే. కొత్తగా మీరట్‌లో ప్రారంభించిన మెట్రో రైలులోని కోచ్‌లు అవి.
భారత్ లోనే ఫాస్టెటస్ మెట్రో వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. మీరట్ మెట్రో సర్వీసులను త్వరలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ రైల్వే సర్వీసులు అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నాయి. మీరట్ మెట్రో బోలెడు ప్రత్యేకతలను కలిగి ఉంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మీరట్ మెట్రో ప్రత్యేకతలు:
❂ ఫాస్టెస్ మెట్రో సర్వీస్
దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో రైలు సర్వీసులు ఇవే. ఈ మెట్రో రైళ్లు గరిష్టంగా గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. నిజానికి ఈ రైళ్లను గంటకు 135 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.
❂ పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైళ్లు
మీరట్ మెట్రో రైళ్లు అన్నీ పూర్తి ఎయిర్ కండిషన్ తో అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్నిఅందించేలా అత్యంత లగ్జరీ ప్యాడెడ్ సీట్లు ఏర్పాటు చేశారు.
❂ ప్రయాణీకుల సామర్థ్యం
మీరట్ మెట్రోలో ఒక్కో రైలు మూడు కోచ్‌లను కలిగి ఉంటుంది. ఒక రైలులో 700 మంది ప్రయాణీకులు కూర్చునే అవకాశం ఉంది. 173 సీట్లు కూర్చోవడానికి అందుబాటులో ఉంటాయి. మిగిలిన ప్రయాణీకులు నిలబడి జర్నీ చేయాల్సి ఉంటుంది.
❂ విద్యుత్ ఆదా
మీరట్ మెట్రో బటన్ ఆపరేటెడ్ డోర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. రైలు స్టేషన్‌కు వచ్చినప్పుడు ప్రయాణీకుడు బటన్ నొక్కిన తర్వాతే డోర్లు ఓపెన్ అవుతాయి. లేదంటే, ఓపెన్ కావు. అవసరం ఉంటేనే డోర్లు ఓపెన్ చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
❂ పటిష్ట భద్రతా వ్యవస్థ
మీరట్ మెట్రోలో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అత్యవసర కమ్యూనికేషన్ సిస్టమ్, ఫైర్ ఎగ్జిస్టింగ్ ఎక్యుప్మెంట్స్, అలారాలు, టాక్ బ్యాక్ సిస్టమ్ సహా పలు ఫీచర్లు ఉంటాయి. వీల్ చైర్ పార్కింగ్ కోసం ప్రత్యేక ప్లేస్ కేటాయించారు. దివ్యాంగులైన ప్రయాణీకులకు సులభంగా మెట్రో ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశారు.
❂ ఆటోమేటిక్ రైలు సెక్యూరిటీ
మీరట్ మెట్రో రైళ్లు లేటెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ATP), ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO) సిస్టమ్ సహా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
❂ వరల్డ్ క్లాస్ సౌకర్యాలు
మీరట్ మెట్రో రైళ్లు లగేజీ రాక్స్, గ్రాబ్ హ్యాండిల్స్, CCTV కెమెరాలు, USB మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, డైనమిక్ రూట్ మ్యాప్‌తో సహా వరల్డ్ క్లాస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
❂ మీరట్ మెట్రో రూట్, స్టేషన్లు
మీరట్ మెట్రో కారిడార్ 23 కిలోమీటర్ల పరిధిలో 13 స్టేషన్లను కలిగి ఉంటుంది. ప్రయాణీకులు ఫస్ట్ స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
❂ మీరట్ మెట్రో ఎక్స్టీరియర్
మీరట్ మెట్రో ఎక్స్టీరియర్ డిజైన్ ఆకుపచ్చ, నీలం, ఆరెంజ్ రంగులతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఈ రైళ్లు గుజరాత్ సావ్లీలోని ఆల్ స్టోమ్ ఫెసిలిటీ కేంద్రంలో తయారు చేశారు.