BigTV English

Top 3 Affordable Electric Cars: ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లకు తిరుగులేదు.. చెప్తున్నా కళ్లు మూసుకొని కోనేయోచ్చు!

Top 3 Affordable Electric Cars: ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లకు తిరుగులేదు.. చెప్తున్నా కళ్లు మూసుకొని కోనేయోచ్చు!

Top 3 Affordable Electric Cars: గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్‌లో విపరీతమైన పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో టాటా మోటార్స్ పూర్తిగా డామినేట్ చేస్తుంది. దేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మోటార్స్ 60 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. అయితే మహీంద్రా MG వంటి కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ మార్కెట్‌లో ఉన్నాయి. మీరు కూడా  కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే బడ్జెట్‌లో ఉండే సింగిల్ ఛార్జ్‌పై ఎక్కువ రేంజ్ అందిస్తున్న తక్కువ బడ్జెట్ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.


MG Comet EV
మీరు తక్కువ బడ్జెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే MG కామెట్ EV అందుబాటులో ఉంది. MG కామెట్ EV వినియోగదారులకు ఒకే ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తోంది. MG కామెట్ EV  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 6.99 లక్షల నుండి రూ. 9.40 లక్షల వరకు ఉంటుంది.

Tata Tiago EV
ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడే కస్టమర్లకు టాటా టియాగో EV ఉత్తమ ఆప్షన్స్‌లో ఒకటిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు తన వినియోగదారులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 345 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. టాటా టియాగో EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 7.99 లక్షల నుండి రూ. 11.89 లక్షల వరకు ఉంటుంది.


Also Read: యమ క్రేజ్.. ఎక్కువగా సేల్ అవుతున్న కార్ ఇదే!

Tata punch EV
భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న SUVలలో ఒకటైన టాటా పంచ్ ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. టాటా పంచ్ EV తన వినియోగదారులకు సింగిల్ ఛార్జీతో 421 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందజేస్తుంది. టాటా పంచ్ EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

Tags

Related News

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Big Stories

×