ఇండియాలో ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలై, మార్చి 31 వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మార్చి నెల రానే వచ్చింది. దీంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యే(March 2025 Deadlines) లోపే మీరు కొన్ని పన్నులను ఆదా చేసుకునేందుకు మీకు మంచి అవకాశం ఉంది. అయితే మీరు ఎలాంటి పన్నులను ఆదా చేసుకోవచ్చు. ఎలా ఆదా చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మార్చి 31, 2025 తేదీకి ముందు మీరు కొన్ని ప్రత్యేక పెట్టుబడులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక FD పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు సాధారణ FDల కంటే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. దీని ద్వారా మీరు మీ పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. ఈ FD పథకాలు 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి స్కీమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్. ఇది పన్ను ఆదా చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు చెల్లించే మొత్తానికి చక్రవడ్డీ రూపంలో మీకు రాబడి సమకూరుతుంది. ప్రస్తుతం దీనిలో 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. కనీస పెట్టుబడి రూ. 500, గరిష్ట పెట్టుబడి సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.
ఈ స్కీం ద్వారా కూడా మీరు మీ 10 ఏళ్లలోపు వయస్సు కుమార్తె పేరుతో సేవింగ్స్ ప్రారంభించుకోవచ్చు. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8.2%గా ఉంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 250, గరిష్ట పెట్టుబడి సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ పూర్తిగా పన్ను రహితం.
Read Also: Recharge Offer: ఈ రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. రూ. 126కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
మీరు ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడి చేయాలనుకుంటే మీకు NSC మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.7%గా ఉంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000 కాగా, ఐదేళ్ల సమయానికి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో మీ పెట్టుబడి నుంచి వచ్చే మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందుతారు.
ఇది సీనియర్ సిటిజన్లకు మంచి సురక్షిత పెట్టుబడి ఎంపిక. ఇందులో ప్రస్తుతం వడ్డీ రేటు 8.2%గా ఉండగా, కనీస పెట్టుబడి రూ. 1,000 కలదు. గరిష్ట పెట్టుబడి రూ. 30 లక్షల వరకు ఉంది. దీనిలో ఐదేళ్లపాటు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. మీ పెట్టుబడిపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు.
బ్యాంకులో మీరు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల కూడా పన్ను ఆదా ప్రయోజనాలను పొందుతారు. వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులను బట్టి మారతాయి. వీటిలో కనీస పెట్టుబడి బ్యాంక్ నిబంధనలు, షరతుల ప్రకారం ఉంటుంది. పెట్టుబడి సమయంలో 5 సంవత్సరాలు కాగా, ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 80C కింద పన్ను మినహాయింపు పొందుతారు. కానీ వడ్డీపై మాత్రం పన్ను విధించబడుతుంది.