BigTV English

GDP : జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన మూడీస్‌.. 6.1% నుంచి 6.8% కు పెంపు..

GDP : జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన మూడీస్‌.. 6.1% నుంచి 6.8% కు పెంపు..

 


GDP

GDP: భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ మూడీస్ పెంచింది. గతంలో ఆర్థికవృద్ధిని 6.1 శాతంగా పేర్కొంది. ఇప్పుడు ఆ అంచనాను సవరించింది. ఆర్థికవృద్ధి 6.8 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచడానికి గల కారణాలు మూడీస్ వెల్లడించింది. 2023లో ఆర్థిక గణాంకాలు అంచనాలను మించాయని పేర్కొంది. అందుకే వృద్ధి అంచనాలను పెంచామని ప్రకటించింది. 2025లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.


ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రభావం క్రమంగా తగ్గిందని మూడీసీ ప్రకటించింది. భారత్ జీడీపీలో 2023 కేలండర్ ఇయర్ లో చివరి త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి నమోదైంది. దీంతో గతేడాది వృద్ధిరేటు 7.7 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం మూలధనం వ్యయం పుంజుకుంది. తయారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో 2023లో భారత్ ఆర్థికవృద్ధి పెరిగింది.

జీ20 దేశాల్లో అత్యంత వేగవంతంగా భారత్ వృద్ధి సాధిస్తోందని మూడీస్ సంస్థ తెలిపింది. సెప్టెంబర్- డిసెంబర్‌ నెలల్లో దేశంలో ఆర్థిక వృద్ధి బాగుందని పేర్కొంది. ఇదే విధంగా మార్చితో ముగిసే త్రైమాసికంలోనూ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. వెహికల్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లోన్ మంజూరులో రెండెంకల వృద్ధి ఉంది. ఇలాంటి అంశాల్లో అర్బన్ ఏరియాల్లో గ్రోత్ కనిపిస్తోందని తెలిపింది.

Read More: ఫ్లిప్ కార్ట్ మరో ముందడుగు.. యూపీఐ సేవలు ప్రారంభించిన ఈకామర్స్ సంస్థ..

దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కూడా ఇదే స్థాయిలో గ్రోత్ ఉంటుందని మూడీస్ పేర్కొంది. కొన్నేళ్లపాటు మూలధన ప్రవాహం, అంతర్జాతీయ వాణిజ్యం అంశాలను ప్రభావితం చేస్తాయని మూడీస్‌ వెల్లడించింది.

Tags

Related News

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Big Stories

×