Ola Roadster x electric bike: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ కోసం యువత కళ్ల కాయలు కాచేలా చూస్తోంది. అదిగో ఇదిగో డెలివరీ అంటోంది ఆ కంపెనీ. ఆ మాట చెప్పి ఇప్పటివరకు రెండు నెలలు గడిచిపోయింది. యవతలో ఆ బైక్‌పై అప్పుడే చిరాకు మొదలైంది. ఇదే క్రమంలో కొత్త కబురు చెప్పింది ఆ కంపెనీ. ఈ నెలలో బైక్ లను డెలివరీ చేస్తామని అంటోంది.
ఈసారైనా డెలివరీ అవుతుందా?
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గతంలో రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వంటి బైక్‌లను ప్రదర్శించింది. ఆ తర్వాత బుకింగ్స్ మొదలు పెట్టేసింది. యూత్‌కి ఆ బైక్ కనెక్ట్ కావడంతో ఆర్డర్లు అదే విధంగా వెల్లువెత్తాయి. తొలుత మార్చిలో వాటిని రిలీజ్ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఏప్రిల్ చెప్పింది.
ఇప్పుడు మే నెల అని చెబుతోంది. ఇంతకీ ఆ కంపెనీ వద్ద స్టాక్ ఉందా? హైప్ క్రియేట్ బైక్‌కి ఇమేజ్ క్రియేట్ చేయాలని భావిస్తోందా? ఇవే ప్రశ్నలు సగటు బైక్ వినియోగ దారులను వెంటాడుతోంది. ఇలా చీటికి మాటికీ డిలే అవ్వడంపై అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి.
కొంతకాలంగా రోడ్‌స్టర్ ఎక్స్ ఈ-బైక్ కోసం బుకింగ్‌లు మొదలుపెట్టింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ఎంట్రీ లెవల్ ఎక్స్ షోరూమ్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ .74,999 నుంచి స్టార్ట్ కానుంది. ఇది అమ్మకానికి ఉన్న లో కాస్ట్ ఈ-బైక్స్‌లో ఒకటి. రోడ్‌స్టర్ ఎక్స్ మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. బేస్ వేరియంట్ అయితే 2.5 కిలోవాట్ల బ్యాటరీతో 140 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగివుంది.
ALSO READ: ప్లాన్ కొంటున్నారా? ఈ పది డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయ లేదో చెక్ చేసుకోండి?
మూడు వేరియంట్లలో ఈ-బైక్‌లు
మిడ్ వేరియంట్ 3.5 కిలోవాట్ల బ్యాటరీతో 196 కిలోమీటర్ల రేంజ్ ఉన్నట్లు కంపెనీ వర్గాల మాట. దీనికి కాస్త అప్‌డేట్‌గా టాప్ వేరియంట్ మోడల్ ని తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 252 కిలోమీటర్లు రావచ్చని చెబుతోంది. దీనికి సంబంధించి 4.5 కిలోవాట్ల బ్యాటరీని రెడీ చేసింది. మూడు వేరియంట్లలోనూ 7 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి నుంచి అమ్మకాల బుకింగ్ మొదలుపెట్టింది. 1,395 రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లు బుకింగ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయా బైక్‌లు డెలివరీ కాలేదు. ఇంతకీ ఆ కంపెనీ వాహనాలను తయారు చేస్తుందా? బైక్ లపై హైప్ క్రియేట్ చేయడానికి ఇలా చేసిందా? ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది.
మే నెలలో మూడు వేరియంట్ల బైక్‌లకు రిలీజ్ చేస్తామని అంటోంది. అన్నమాట ప్రకారం డెలివరీ చేస్తుందా? లేదా అనేది అసలు పాయింట్. మార్కెట్లోకి వచ్చేవరకు ఆ కంపెనీ స్టేట్‌మెంట్ నమ్మలేమని అంటున్నారు యువకులు. మొత్తానికి ఆ కంపెనీ బైకులపై యువతలో క్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నాయనే చెప్పవచ్చు.